iDreamPost
android-app
ios-app

వెనక్కు తగ్గిన ‘ఊరు పేరు భైరవకోన’.. ఇండస్ట్రీ మంచి కోరుతూ..!

  • Published Jan 30, 2024 | 7:16 PM Updated Updated Jan 30, 2024 | 7:16 PM

Ooru Peru Bhairavakona New Release Date: సందీప్ కిషన్- వర్షా బొల్లమ్మ కాంబోలో వస్తున్న ఉరు పేరు భైరవకోన మరోసారి వాయిదా పడింది. ఈసారి అధికారిక డేట్ ని ప్రకటించారు.

Ooru Peru Bhairavakona New Release Date: సందీప్ కిషన్- వర్షా బొల్లమ్మ కాంబోలో వస్తున్న ఉరు పేరు భైరవకోన మరోసారి వాయిదా పడింది. ఈసారి అధికారిక డేట్ ని ప్రకటించారు.

  • Published Jan 30, 2024 | 7:16 PMUpdated Jan 30, 2024 | 7:16 PM
వెనక్కు తగ్గిన ‘ఊరు పేరు భైరవకోన’.. ఇండస్ట్రీ మంచి కోరుతూ..!

సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ ల విషయంలో ఏర్పడిన సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకే డేట్ కోసం చాలానే సినిమాలు పోటీ పడటంతో ఇండస్ట్రీ మొత్తం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు సంక్రాంతి సీజన్ అయితే ముగిసింది. కానీ, సినిమాల రిలీజ్ ల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈగల్ కు సోలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ, ఆ రోజున ఊరు పేరు భైరవకోన రావడంతో మళ్లీ కన్ఫూజన్ మొదలైంది. తాజాగా ఊరి పేరు భైరవకోన రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి వెనక్కి తగ్గుతున్నాం అంటూ వెల్లడించారు.

సందీప్ కిషన్- వర్షా బొల్లమ్మ కాంబోలో వీఐ ఆనంద్ దర్శకత్వంలో నిర్మించిన ఫాంటసీ చిత్రం ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులు కావస్తోంది. కానీ, రిలీజ్ కి మాత్రం నోచుకోలేదు. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడి ఫిబ్రవరి 9కి ఫిక్స్ చేసుకున్నారు. ఆ డేట్ ని దృష్టిలో పెట్టుకుని ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ, ఆ రోజున ఈగల్ సినిమా రిలీజ్ కి వచ్చింది. జనవరి 15న విడుదల కావాల్సిన ఈగల్ చిత్రం.. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. రిలీజ్ కాబోతున్న చిత్రాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈగల్ సినిమా టీమ్ స్వచ్ఛందంగా రిలీజ్ ని వాయిదా వేసుకున్నారు.

ఈగల్ చిత్రాన్ని వాయిదా వేసుకున్నందుకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామంటూ ఫిల్మ్ ఛాంబర్ మాటిచ్చింది. ఇచ్చిన మాట కోసం ఊరు పేరు భైరవకోన టీమ్ తో ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు సమావేశం అయ్యారు. వారిని రిలీజ్ డేట్ మార్చుకోవాల్సిందిగా కోరారు. అందుకు ఏకే ఎంటర్ టైన్మెంట్స్ కూడా సానుకూలంగా స్పందించింది. ఎట్టకేలకు తమ అధికారిక రిలీజ్ డేట్ ని అయితే ప్రకటించారు. ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అంటూ చెప్పారు. ఆ విషయాన్ని హీరో సందీప్ కిషన్, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. “తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. తెలుగు సినిమా మంచి కోరుతూ ప్రస్తుతానికి వెనక్కి తగ్గుతున్నాం. ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్ గా ఊరు పేరు భైరవకోన సినిమా మ్యాజిక్ చేయబోతోంది” అంటూ క్లారిటీ ఇచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by AK Entertainments (@akentsofficial)

టీమ్ తీసుకున్న నిర్ణయంపై ఇండస్ట్రీ పెద్దలు మాత్రమే కాకుండా.. అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాతావరణం ఇండస్ట్రీకి కావాలంటూ ఉరు పేరు భైరవకోన టీమ్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఫిబ్రవరి 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫిబ్రవరి 15న యూఎస్ఏ ప్రీమియర్స్ ఉంటాయని వెల్లడించారు. ఈ సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ అన్నీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. గరుడపురాణంలో మిస్ అయిన 3 పేజీల్లో ఏముంది? అనే పాయింట్ మీద ఈ కథ నడుస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. మరి.. ఊరు పేరు భైరవకోన మరోసారి వాయిదా పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by AK Entertainments (@akentsofficial)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss