iDreamPost
android-app
ios-app

ఈ చిన్నోడిని గుర్తుపట్టారా…? ఒక్క వెబ్ సిరీస్‌తో హీరో అయ్యాడు..!

  • Published Aug 02, 2024 | 1:00 AM Updated Updated Aug 02, 2024 | 1:00 AM

ఈ ఫోటోలో ఉన్న చిన్నోడిని గుర్తు పట్టారా...? సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి.. ఇప్పుడు వెండితెరపై నవ్వులు పువ్వులు పూయిస్తున్నాడు. ఈ ఏడాదే హీరోగా మారాడు. ఇంతకు ఎవరంటే..?

ఈ ఫోటోలో ఉన్న చిన్నోడిని గుర్తు పట్టారా...? సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి.. ఇప్పుడు వెండితెరపై నవ్వులు పువ్వులు పూయిస్తున్నాడు. ఈ ఏడాదే హీరోగా మారాడు. ఇంతకు ఎవరంటే..?

  • Published Aug 02, 2024 | 1:00 AMUpdated Aug 02, 2024 | 1:00 AM
ఈ చిన్నోడిని గుర్తుపట్టారా…? ఒక్క వెబ్ సిరీస్‌తో హీరో అయ్యాడు..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని కొంత మంది నటులుగా మారుతున్నారు. యూట్యూబ్, ఇన్ స్టాలో షార్ట్ ఫిల్మ్స్, షాట్స్, రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు. ఒక్క వీడియో పాపులర్ అవ్వడంతో పాటు సినీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. టాలెంట్ ఎక్కడ ఉంటే.. అలాంటి వారిని అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది ఇండస్ట్రీ. ఒక్కసారి క్లిక్ అయితే చాలు వెను దిరిగి చూసుకోవాల్సి అవసరం లేదు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పిల్లాడు కూడా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నాడు. సినిమాలపై ఇంట్రస్ట్‌తో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ ఫుల్ నటుడిగా కొనసాగుతున్నాడు. తెరపై అతడు కనిపించాడంటే కితకితలు పుట్టాల్సిందే. ఇంతకు ఆ చిన్నోడిని గుర్తుపట్టారా.. ప్రముఖ కమెడియన్ హర్ష చెముడు.

ఈ పేరు కన్నా వైవా హర్ష అంటేనే బాగా కనెక్ట్ అవుతుంటారు తెలుగు ఆడియన్స్. అంతలా ఆకట్టుకున్న యూట్యూబ్ వెబ్ సిరీస్ వైవా. 2013లో యూట్యూబ్‌లో ఓ సంచలనం. లెక్చరర్‌గా అతడు పండించిన ఫన్ కడుపుబ్బా నవ్వించింది. ఈ వెబ్ సిరీస్‌లోనే షణ్ముఖ్ జశ్వంత్ కూడా యాక్ట్ చేసిన సంగతి విదితమే. దీంతో అతడికి సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి. మసాలా అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కేవలం కామెడీ మాత్రమే కాదు సీరియస్ క్యారెక్టర్లలో కూడా మెప్పించగలను అని సుందరం మాస్టర్ మూవీతో నిరూపించాడు. విశాఖ పట్నంలో పుట్టి పెరిగిన వైవా హర్ష, అక్కడే బీటెక్ పూర్తి చేశాడు. ఇంట్రోవర్ట్ అయిన హర్ష.. తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ కమెడియన్‌గా మారాడు. తెలుగు తెరకు లభించిన యోగి బాబు (నటన, సినిమా కెరీర్ పరంగా)

వైవా హర్షగా యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించాడు హర్ష చెముడు. మసాలా మూవీతో పాటు మైనే ప్యార్‌కియా, పవర్‌, గోవిందుడు అందరివాడేలే, సింగం 123, జత కలిసే, సూర్య వర్సెస్‌ సూర్య, సైజ్‌ జీరో, దోచేయ్‌, శంకరా భరణం, కృష్ణాష్టమి, రాజా చెయ్ వేస్తే, జక్కన్న, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజా ది గ్రేట్‌, నక్షత్రం, జై లవకుశ, తొలి ప్రేమ, తేజ్‌ ఐ లవ్యూ, ఛలో, భానుమతి అండ్‌ రామకృష్ణ వంటి చిత్రాల్లో నటించాడు. బాగా రిజిస్టర్ అయిన మూవీ కలర్ ఫోటో. ఇందులో బాలా యేసుగా అతడి ఫెర్ఫ్మామెన్స్ బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, తిమ్మరుసు, వివాహ భోజనంబు, పక్కా కమర్షియల్, కార్తికేయ 2, బింబిసార, బేబీ ఊరుపేర భైరవ కోన తదితర సినిమాల్లో నటించి మెప్పించాడు. అంతేకాకుండా ఓటీటీల్లో కూడా మెరిశారు. త్రీ రోజెస్‌లో మంచి కామెడీ పండించాడు. డెడ్ ఫిక్సల్ కూడా ఆకట్టుకుంది. ఈ ఏడాది సుందరం మాస్టర్ సినిమాతో హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల రిలీజైన ప్రసన్న వదనం, ఆ ఒక్కటి అడక్కు సినిమాల్లోనూ హర్ష కీలక పాత్రలు పోషించాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet