iDreamPost
android-app
ios-app

రాయన్ మూవీ సక్సెస్.. ధనుష్ కి రెండు చెక్కులు అందజేసిన నిర్మాత

  • Published Aug 22, 2024 | 5:45 PM Updated Updated Aug 22, 2024 | 5:45 PM

Mr. Kalanithi Maran congratulated Dhanush: రీసెంట్ గా ధనుష్ నటించిన రాయన్ మూవీకి విపరీతమైన స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు స్టార్స్ అందరి దగ్గర నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సన్ గ్రూప్స్ చైర్మన్ కూడా ధనుష్ ను అభినందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Mr. Kalanithi Maran congratulated Dhanush: రీసెంట్ గా ధనుష్ నటించిన రాయన్ మూవీకి విపరీతమైన స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు స్టార్స్ అందరి దగ్గర నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సన్ గ్రూప్స్ చైర్మన్ కూడా ధనుష్ ను అభినందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 22, 2024 | 5:45 PMUpdated Aug 22, 2024 | 5:45 PM
రాయన్ మూవీ సక్సెస్.. ధనుష్ కి రెండు చెక్కులు అందజేసిన నిర్మాత

కథ బావుంటే కనుక ఆ సినిమా హిట్ విషయం ఇక ప్రేక్షకులే చూసుకుంటారనే.. ఫార్ములా ఇప్పటికే చాలా సినిమాల విషయంలో ప్రూవ్ అయింది. అలాంటి సినిమాల లిస్ట్ లో ధనుష్ లేటెస్ట్ గా నటించిన రాయన్ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే 50వ సినిమాగా తెరకెక్కడం , అలాగే ఇప్పటివరకు రిలీజ్ అయినా ధనుష్ సినిమాలలో తెలుగులో అత్యధిక థియేటర్స్ సంపాదించుకున్న సినిమాగా కూడా.. రాయన్ మంచి బజ్ సంపాదించుకుంది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా విషయంలో .. తాజాగా సన్ గ్రూప్స్ చైర్మన్ కూడా ధనుష్ ను అభినందించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ధనుష్ రాయన్ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్స్ పై .. కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. జూలై 26న తమిళంతో పాటు.. తెలుగులోనూ రిలీజ్ అయినా ఈ సినిమాకు.. ఊహించని రెస్పాన్స్ లభించింది. తెలుగు కంటే కూడా తమిళంలో ఈ మూవీకి భారీ స్పందన లభించింది. ధనుష్ నటన విషయంలో ప్రేక్షకులు ఎప్పుడు ఫిదా అయిపోతూ ఉంటారు. కానీ ఈసారి ధనుష్ నటనతో పాటు డైరెక్షన్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇదే విషయంపై అభినందిస్తూ.. సన్ గ్రూప్స్ చైర్మన్ కళానిధి మారన్ ధనుష్ కు రెండు చెక్స్ ను అందచేశారు ఒకటి హీరోగా తన నటనకు, మరొకటి తన డైరెక్షన్ కు.. దీనికి సంబంధించిన పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్ట్ పై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ధనుష్ కష్టానికి తగిన ఫలితం దక్కిందని చెప్పి తీరాల్సిందే.

Raayan

ఇక రాయన్ సినిమా విషయానికొస్తే.. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చాలా న్యాచురల్ గా కొనసాగిన కథ.. సెంటిమెంటల్ సీన్స్ ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయని చెప్పి తీరాలి. ఇక థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా రన్ అయినా ఈ సినిమా.. నెల లోపే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో ఆగస్ట్ 23 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. తెలుగు , హిందీ , తమిళం , కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి రానుంది. కాబట్టి థియేటర్ లో ఈ మూవీ మిస్ అయిన వారు.. ఎంచక్కా ఓటీటీ లో చూసేయండి. మరి కళానిధి మారన్ రాయన్ సక్సెస్ విషయంలో స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş