iDreamPost
android-app
ios-app

తండ్రికి మళ్లీ పెళ్లి చేసిన నటి.. అమ్మకు స్వాగతం చెబుతూ ఎమోషనల్‌!

  • Published Jun 21, 2023 | 1:06 PM Updated Updated Jun 21, 2023 | 1:06 PM
  • Published Jun 21, 2023 | 1:06 PMUpdated Jun 21, 2023 | 1:06 PM
తండ్రికి మళ్లీ పెళ్లి చేసిన నటి.. అమ్మకు స్వాగతం చెబుతూ ఎమోషనల్‌!

రెండో పెళ్లి అనేది మన సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. చిన్న వయసులోనే భాగస్వామి మరణించినా, విడిపోయినా, మళ్లీ పెళ్లి చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించేవాళ్లు కోకొల్లలు. అయితే ఇలా రెండో వివాహం చేసుకునే అంశంలో ఆడవారి కన్నా మగవారికే ఎక్కువ వెసులుబాటు, అవకాశాలు ఉంటున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో.. ఒంటరిగా మిగిలిన తల్లిదండ్రులకు.. పిల్లలే స్వయంగా దగ్గరుండి పెళ్లి చేస్తున్నారు. జీవిత మలి సంజలో తోడు ఎంతో అవసరం. అన్నాళ్లు బిడ్డలను చూసుకుని బ్రతికిన తల్లిదండ్రులు.. పిల్లలు తమ జీవితాల్లో సెటిల్‌ అయిన తర్వాత వారు ఒంటరిగా మిగులుతారు.

ఇన్నాళ్లు తమ కోసం కష్టపడ్డ తల్లిదండ్రులు.. కనీసం ఈ వయసులోనైనా సంతషంగా ఉండాలని భావించి.. తామే పెళ్లి పెద్దలుగా మారి.. తల్లిదండ్రులకు వివాహం చేస్తున్నారు పిల్లలు. ఇక తాజాగా ఓ నటి కూడా ఇలాంటి పని చేసింది. ఒంటరిగా ఉన్న తండ్రికి మళ్లీ పెళ్లి చేసి.. పది మందికి ఆదర్శంగా నిలిచింది. ఆమె చేసిన పనులపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..

బాలీవుడ్ బుల్లితెర నటి సుంబల్‌ తౌకీర్‌.. తన తండ్రికి రెండో పెళ్లి చేసింది. ఇంతకు ఎవరీ నటి అంటే.. ఈమె మన తెలుగు వారికి పరిచయం లేకపోవచ్చు కానీ.. హిందీ టీవీ షోస్‌, సినిమాలు చూసే వారికి ఇమె పరిచయమే. 2013లో షో జోధా అక్బర్‌తో బుల్లితెరకు పరిచయమైన సుంబుల్‌ ఇమ్లీ.. ఆ తర్వాత పలు టీవీ షోలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ వెంటనే సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యహరిస్తోన్న ప్రముఖ రియాలిట షో హిందీ బిగ్‌బాస్‌-16 సీజన్‌లో అడుగుపెట్టింది. తద్వారా ఈ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలిగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస షోలు చేస్తూ.. ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఇదిలా ఉంటే తాజాగా తన తండ్రికి రెండో పెళ్లి చేసి వార్తల్లో నిలిచింది ఈబాలీవుడ్ అందాల తార. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. తన తండ్రి రెండో పెళ్లికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేయడమే కాక.. ‘‘మేం చాలా హ్యాపీగా ఉన్నాం. నూతన దంపతులను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం. ఈ బంధం వల్ల మా నాన్నగారి భార్యతో పాటు నాకు ఒక కొత్త సోదరి కూడా మా కుటుంబంలోకి వస్తోంది’’ అని అంటూ హర్షం వ్యక్తం చేసింది సుంబల్‌. కాగా ఈ నటి తండ్రి పెళ్లి చేసుకున్న మహిళ పేరు నీలోఫర్‌. ఆమెకు కూడా ఇంతకు ముందే పెళ్లైంది. అయితే విడాకులు తీసుకుంది. తనకు రెండేళ్ల పాప కూడా ఉంది. సుంబల్‌ చేసిన పనిపై నెటిజనులు ప్రశంసులు కురిపిస్తున్నారు. చాలా గొప్ప పనిచేశావంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss