iDreamPost
android-app
ios-app

పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ లో.. అసలైనోడే మిస్ కాబోతున్నాడా..?

  • Published Nov 08, 2024 | 3:24 PM Updated Updated Nov 08, 2024 | 3:24 PM

పుష్ప 2 కోసం దేశం అంతా ఎదురుచూస్తుంది. అయితే ఇప్పుడు దానికంటే ముందు ప్రమోషన్స్ కోసం ఒకింత ఎక్కువే ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రమోషన్స్ లో అసలైనోడే మిస్ అవ్వబోతున్నాడట. ఈ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

పుష్ప 2 కోసం దేశం అంతా ఎదురుచూస్తుంది. అయితే ఇప్పుడు దానికంటే ముందు ప్రమోషన్స్ కోసం ఒకింత ఎక్కువే ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రమోషన్స్ లో అసలైనోడే మిస్ అవ్వబోతున్నాడట. ఈ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Nov 08, 2024 | 3:24 PMUpdated Nov 08, 2024 | 3:24 PM
పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ లో.. అసలైనోడే మిస్ కాబోతున్నాడా..?

బన్నీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా కూడా డిసెంబర్ 5 కోసం ఎదురుచూస్తున్నారు. బన్నీ కెరీర్ లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా పుష్ప 2 మూవీ రాబోతుంది. ఎలా అయినా సరే ఈ మూవీ తో 1000 కోట్ల అందుకోవాలని మూవీ టీం బలంగా ఫిక్స్ అయ్యారు. ప్రీ బుకింగ్ సేల్స్ కూడా అలానే జరుగుతున్నాయి. ఇక ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. దాని కోసం పక్కా స్కెచ్ సిద్దమౌతుంది. ఇప్పటివరకు ఏ సినిమాకు లేని విధంగా ఈ మూవీ ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా స్టార్ క్రికెటర్స్ నే రంగంలోకి దించుతున్నారు. ప్లాన్స్ వరకు బాగానే ఉన్నాయి. మరి వర్క్ అవుట్ అవుతుందా అనే సందేహాలు కూడా అందరిలో ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం సుకుమార్ లాస్ట్ మినిట్ టెన్షన్స్ లో ఉన్నాడు. ఈ సంగతి అందరికి తెలిసిందే.

నవంబర్ 20 నాటికి పుష్ప 2 ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందని ఆల్రెడీ చెప్పారు. కానీ ఇంకా కనీసం 10 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని టాక్. సరే ఎదో ఒకటి చేసి సుకుమార్ చెప్పిన టైం కి సినిమా అందిస్తాడు అనే నమ్మకం కూడా కొంతమందిలో ఉంది. ఇదంతా సరే సినిమా అవుట్ పుట్ విషయం పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు అందరు ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు . ఎందుకంటే సాధారణంగా ఈవెంట్స్ లో మూవీ టీం అంతా కూడా తెర వెనుక జరిగే ఎన్నో విషయాలను పంచుకుంటారు. ఇప్పుడు పుష్ప ఈవెంట్స్ విషయంలోనూ ఇలాంటి ఆసక్తినే బరుస్తున్నారు. నార్మల్ గా సుకుమార్ సినిమాలకు ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలలో కథ చాలా బలంగా ఉంటుందని అంతా నమ్ముతారు. అలాగే ఆయన మాటలకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సుకుమార్ పుష్ప 2 గురించి మాట్లాడితే వినాలని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మాత్రం అది జరిగేలా లేదు. సుకుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు అటెండ్ అయ్యే ఛాన్స్ ఎక్కడా కనిపించడం లేదు. పుష్ప 1 విషయంలోను ఇదే జరిగింది. మూవీ రిలీజ్ కు ముందు ఒక రోజు ప్రెస్ మీట్ లో మాత్రమే ఆయన కనిపించారు. ఇప్పుడు కనీసం ప్రెస్ మీట్ లో కనిపించడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఎడిటింట్, డబ్బింగ్, మిక్సింగ్ వంటివి లాంటి పనులన్నీ కూడా సుకుమార్ దగ్గరుండి చేయించాలి. టైం కూడా దగ్గరపడుతుంది. సో ఈవెంట్స్ లో దాదాపు సుకుమార్ మిస్ అయ్యినట్లే అని టాక్. దీనితో అసలైనోడే మిస్ అయితే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.  ఇక అభిమానుల కోసమైనా సుకుమార్ కనీసం ఓసారైన మాట్లాడతాడేమో చూడాలి.  మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet