iDreamPost
android-app
ios-app

సుహాస్ కొత్త కాన్సెప్ట్.. ఈసారి మాస్ టచ్ తో అదరగొట్టాడు!

  • Published Mar 07, 2024 | 4:52 PM Updated Updated Mar 07, 2024 | 4:52 PM

Suhas New Movie Teaser: హీరో సుహాస్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. అంబాజీపేట సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ చేయకముందే ప్రసన్న వదనం అంటూ కొత్త కాన్సెప్ట్ తో వచ్చేశాడు.

Suhas New Movie Teaser: హీరో సుహాస్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. అంబాజీపేట సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ చేయకముందే ప్రసన్న వదనం అంటూ కొత్త కాన్సెప్ట్ తో వచ్చేశాడు.

  • Published Mar 07, 2024 | 4:52 PMUpdated Mar 07, 2024 | 4:52 PM
సుహాస్ కొత్త కాన్సెప్ట్.. ఈసారి మాస్ టచ్ తో అదరగొట్టాడు!

హీరో సుహాస్.. టాలీవుడ్ లో ఈ పేరు ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఎందుకంటే ఈ హీరో ఎంచుకునే సినిమాలు, చేసే పాత్రలు అన్నీ ఎంతో భిన్నంగా ఉంటాయి. సపోర్టింగ్ రోల్ చేసినా.. హీరోగా చేసినా ఆ వైవిధ్యాన్ని మాత్రం చూపిస్తూనే ఉంటాడు. తన సక్సెస్ సీక్రెట్ అదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారికి సుహాస్ ఒక మంచి ఉదాహరణగా కూడా నిలుస్తాడు. ఇప్పటికే హీరోగా హ్యాట్రిక్ హిట్టు కొట్టిన సుహాస్.. ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది కూడా పక్కా సక్సెస్ అని టీజర్ చూసిన తర్వాత అనిపిస్తోంది.

ఒక ఆర్టిస్ట్ సక్సెస్ ఎక్కడ ఉంటుంది అంటే.. తన హార్డ్ వర్క్, డెడికేషన్ లో మాత్రమే కాదు. అతను ఎంచుకునే కథలు, చేసే పాత్రలను బట్టి కూడా ఉంటుంది. అందుకు సుహాస్ ను బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపించవచ్చు. అతను ఒక కథను ఎచుకున్నాడు అంటే అది పక్కా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోవాల్సిందే. ఇటీవల అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా ప్రమోషన్స్ లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఎంతో నమ్మకంగా చెప్పాడు. చాలామంది దానిని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అనుకున్నారు. కానీ, రిజల్ట్ చూసిన తర్వాత సుహాస్ జడ్జిమెంట్ కి ఫిదా అయిపోయారు.

తాజాగా అర్జున్ వైకే దర్శకత్వంలో ప్రసన్నవదనం అనే సినిమాని చేస్తున్నాడు. ఈ ప్రసన్న వదనం మూవీలో వైవా హర్ష సుహాస్ ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. హీరోయిన్స్ గా పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్ నటిస్తున్నారు. సుహాస్ ఈ ప్రసన్నవదనం సినిమా కూడా కథ వినగానే బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం కలిగింది అన్నాడు. నిజానికి టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా అదే భావన కలుగుతోంది. ప్రసన్నవదనం అనేది పూర్తి భిన్నమైన కాన్సెప్ట్. ఫేస్ బ్లైండ్ అనే ఒక అరుదైన వ్యాధితో హీరో బాధపడుతూ ఉంటాడు. ఒక మనిషిని చూసి అతను గుర్తుపట్టలేడు.

ఆఖరికి కన్న తల్లిదండ్రులనే గుర్తించలేని పరిస్థితిలో ఉంటాడు. అలాంటి వాడికి శత్రువులెవరో, మిత్రులెవరో, ప్రేమించిన అమ్మాయి ఎవరో? ఎలా తెలుస్తుంది. ఒక తెలియని శత్రువుతో నిత్యం యుద్ధం చేస్తూ ఉంటాడు. నిజంగా ఈ స్టోరీ లైన్ వింటుంటూనే ఒక స్పెషల్ ఫీలొస్తోంది. అదే కాన్సెప్ట్ ని అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కిస్తే మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ విలన్ నితిన్ ప్రసన్న ఒక పోలీసు పాత్ర చేస్తున్నాడు. మరి.. ప్రసన్నవదనం మూవీ టీజర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş