iDreamPost
android-app
ios-app

సుహాస్ లేటెస్ట్ మూవీ జనక అయితే గనక రిలీజ్ పోస్ట్ పోన్.. కారణమిదే

  • Published Sep 04, 2024 | 1:07 PM Updated Updated Sep 04, 2024 | 1:21 PM

Janaka Aithe Ganaka Movie Got Postponed: టాలీవుడ్ నటుడు సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ జనక అయితే గనుక.. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కు రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అంటూ.. ఓ పోస్ట్ ను రివీల్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Janaka Aithe Ganaka Movie Got Postponed: టాలీవుడ్ నటుడు సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ జనక అయితే గనుక.. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కు రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అంటూ.. ఓ పోస్ట్ ను రివీల్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 04, 2024 | 1:07 PMUpdated Sep 04, 2024 | 1:21 PM
సుహాస్ లేటెస్ట్ మూవీ జనక అయితే గనక రిలీజ్ పోస్ట్ పోన్.. కారణమిదే

గత నెలలో థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలలో చిన్న సినిమాలే ప్రేక్షకులను బాగా మెప్పించాయి. దీనితో ప్రస్తుతం అందరి ఫోకస్ ఈ సినిమాలే మీదే ఉంది. ఈ క్రమంలో ఈ నెలలో థియేటర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు నివేద థామస్ 35 చిన్న కథ కాదు, సుహాస్ జనక అయితే గనక.. ఈ రెండు సినిమాలకు ప్రస్తుతానికి డీసెంట్ హైప్ నెలకొంది. ఈ క్రమంలో సుహాస్ నటించిన జనక అయితే గనక మూవీ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇప్పటికే ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. తాజాగా మూవీ టీమ్.. ఈ సినిమా వాయిదా అంటూ ఓ పోస్ట్ ను షేర్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా డీసెంట్ హిట్స్ తో దూసుకుపోతున్న హీరో సుహాస్. ఇప్పటికే ఈ హీరో నటించిన అన్ని సినిమాలు దాదాపు ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా సుహాస్ నటించిన మూవీ జనక అయితే గనుక.. సెప్టెంబర్ 7న థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఎలాగూ చిన్న సినిమాలు ఊహించని రెస్పాన్స్ సంపాదించుకోవడంతో.. ఎలా అయినా ఈ వీకెండ్ ఈ సినిమాను చూడాలని ఫిక్స్ అయ్యారు మూవీ లవర్స్. కానీ ఇప్పుడు అది జరిగేలా లేదు. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. “ఇప్పుడు వర్షాల మోత.. తర్వాత నవ్వుల మోతతో కలుద్దాం” అంటూ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని పోస్ట్ చేశారు. ఇక కొత్త రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది. కాబట్టి ఈ మూవీ నెక్స్ట్ అప్ డేట్ కోసం వెయిట్ చేయాల్సిందే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా.. ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో సినీ వర్గాల నటి నటులు కూడా .. వరద భాదితులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. దానికి సంబంధించిన వార్తలు కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ సినిమా రిలీజ్ చేసినా కూడా.. కలెక్షన్స్ అంతగా రాకపోవచ్చు.. కాబట్టి మేకర్స్ సరైన నిర్ణమయమే తీసుకున్నారని చెప్పి తీరాల్సిందే. మరి ఈ సినిమా కాకుండా మరేమైనా సినిమాలు కూడా వాయిదా పడతాయో లేదా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతాయో చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.