iDreamPost
android-app
ios-app

వీడియో: సుధీర్ షోలో సిరి- శ్రీహాన్ సందడి.. ఫ్యాన్స్ కు కన్నులపండగే!

  • Published Jun 10, 2024 | 6:05 PM Updated Updated Jun 10, 2024 | 6:05 PM

Sudigali Sudheer Sarkaar Season 4- Siri And Hanmanth Shrihan: సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ సీజన్ 4 నుంచి కొత్త ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో లవ్ బర్డ్స్ సిరి హన్మంత్- శ్రీహాన్ అల్లరి నెక్ట్స్ లెవల్లో ఉంది.

Sudigali Sudheer Sarkaar Season 4- Siri And Hanmanth Shrihan: సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ సీజన్ 4 నుంచి కొత్త ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో లవ్ బర్డ్స్ సిరి హన్మంత్- శ్రీహాన్ అల్లరి నెక్ట్స్ లెవల్లో ఉంది.

  • Published Jun 10, 2024 | 6:05 PMUpdated Jun 10, 2024 | 6:05 PM
వీడియో: సుధీర్ షోలో సిరి- శ్రీహాన్ సందడి.. ఫ్యాన్స్ కు కన్నులపండగే!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతున్న టాక్ షో ఏదైనా ఉంది అంటే.. అది సుడిగాలి సుధీర్ వ్యాఖ్యతగా చేస్తున్న ‘సర్కార్ సీజన్ 4’ అనే చెప్పాలి. యాంకర్ ప్రదీప్ తర్వాత.. సుధీర్ వచ్చాక ఈ షోకి ఓటీటీలో డిమాండ్ మరింత పెరిగింది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ మూవీస్ ని కూడా వెనక్కి నెట్టి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆహాలో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉంటోంది. ఒక్కసారి రెండుసార్లు కాదు.. కొత్త ఎపిసోడ్ రాగానే ఆహాలో ట్రెండింగ్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో బాగానే ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం లవ్ బర్డ్స్ సిరి హన్మంతు- శ్రీహాన్ అనే చెప్పాలి.

సిరి హన్మంత్- శ్రీహాన్ జంట గురించి తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా యూట్యూబ్- ఇన్ స్టాగ్రామ్ ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రేమ పక్షలు ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటారు. యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ తో వీళ్లిద్దరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకోవడమే కాకుండా.. సెలబ్రిటీ హోదాను కూడా అందుకున్నారు. ఈ లవ్ బర్డ్స్ అప్పుడప్పుడు షోస్ కి వచ్చి సందడి చేస్తూనే ఉంటారు. తాజాగా సుడిగాలి సుధీర్ సర్కార్ సీజన్ 4కి వచ్చి.. ఫ్యాన్స్ కి మంచి సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు.

సిరి హన్మంతు- శ్రీహాన్ సర్కార్ షోలో సందడి చేశారు. ఇద్దరూ వరుస పంచులు, కౌంటర్స్ తో సుడిగాలి సుధీర్ కి కూడా షాకుల మీద షాకులు ఇచ్చారు. అంతేకాకుండా.. శ్రీహాన్ చేసిన అల్లరి నెక్ట్స్ లెవల్ అంతే. సిరి తన ముందు ఉండగానే.. మరో అమ్మాయికి లవ్ లెటర్ రాయడమే కాకుండా.. చదివి వినిపించాడు కూడా. అంతేకాకుండా.. వీళ్లిద్దరు అప్పుడప్పుడు సరసాలు కూడా ఆడుకున్నారు. శ్రీహాన్ అయితే సిరి కోసం సుందరి అంటూ పాట కూడా పాడాడు. ఆ తర్వాత ఆమెకు నుదుటి మీద ఒక ముద్దు కూడా పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత మరోసారి ట్రెండింగ్ లోకి వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంక వీళ్లకి తోడు మరో వైరల్ జంట సోనియా సింగ్- పవన్ సిద్ధూ కూడా ఈ షోలో సందడి చేశారు. ఇంక వాళ్ల కామెడీ కూడా మిమ్మల్ని పడి పడి నవ్వేలా చేస్తుంది. ఇంక సగం అర్థమయ్యి.. సగం అర్థం కాకుండా.. సోనియా సింగ్ చేసే అల్లరికి పొట్ట చక్కలు అవుతుంది. వీటన్నింటికి మించి సుడిగాలి సుధీర్ యాంకరింగ్ మెప్పిస్తుంది. ఇలా ఈ సర్కార్ సీజన్ 4 న్యూ ఎపిసోడ్ కచ్చితంగా ట్రెండింగ్ లోకి వస్తుందని అర్థమవుతోంది. మరి.. ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss