iDreamPost
android-app
ios-app

బుల్లితెరపైకి సుడిగాలి సుధీర్‌ రీఎంట్రీ.. ఈసారి మాములుగా లేదుగా

  • Published May 14, 2024 | 12:13 PM Updated Updated May 14, 2024 | 12:13 PM

Sudigali Sudheer: బుల్లితెర సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్‌.. కొన్ని రోజులుగా స్మాల్‌ స్క్రీన్‌ మీద కనిపించడం లేదు. అతడు తిరిగి రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. ఆ వివరాలు..

Sudigali Sudheer: బుల్లితెర సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్‌.. కొన్ని రోజులుగా స్మాల్‌ స్క్రీన్‌ మీద కనిపించడం లేదు. అతడు తిరిగి రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. ఆ వివరాలు..

  • Published May 14, 2024 | 12:13 PMUpdated May 14, 2024 | 12:13 PM
బుల్లితెరపైకి సుడిగాలి సుధీర్‌ రీఎంట్రీ.. ఈసారి మాములుగా లేదుగా

సుడిగాలి సుధీర్‌.. ఈ పేరుకున్న క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. క‍ష్టపడి పని చేస్తూ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. బుల్లితెర సూపర్‌స్టార్‌గా ఎదిగాడు సుధీర్‌. మెజిషియన్‌గా తన కెరీర్ మొదలు పెట్టాడు. మ్యాజిక్‌ షోలు చేస్తూనే.. వెండి తెర మీద కనిపించే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో జబర్దస్త్ ఆఫర్‌.. సుధీర్ కెరీర్‌ను మలుపు తిప్పింది. వేణు టీంలోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సుధీర్ తన టాలెంట్‌తో.. టీమ్‌ లీడర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత యాంకర్‌గా మారి.. మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అక్కడితోనే ఆగిపోయాడా అంటే లేదు.. బుల్లితర మీద సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌.. హీరోగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చాడు. వరుసగా సినిమాలు చేశాడు. సుధీర్‌ నటించిన గాలోడు సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

ఓటీటీల్లో కూడా రాణిస్తున్నాడు సుధీర్‌. ఆహా ఓటీటీలో సర్కార్‌ సీజన్‌ 4కు హోస్ట్‌గా ఉన్నాడు సుధీర్‌. తాజాగా సర్కార్‌ 4 కి కాజల్‌ రావడం.. ఆమెతో సుధీర్‌ చేసిన చిట్‌చాట్‌ చాలా ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తెగ వైరల్‌ అవుతుంది. వీటి సంగతి అలా ఉంచితే.. సుధీర్‌ మళ్లీ బుల్లితెర మీద కనిపించాలని.. యాంకర్‌గా చేయాలని అతడి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో.. అభిమానులు కోరిక తీరలేదు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఓ ప్రోమో చూసి సుధీర్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ఇంతకు ఏంటా ప్రోమో.. అంటే..

సుధీర్‌ యాంకర్‌గా ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో షో రాబోతుంది. అదే ఫ్యామిలీ స్టార్‌. తాజాగా ఈ ప్రోమోని విడుదల చేశారు. సాధారణంగా సుధీర్‌ అనగానే కూల్‌ అండ్‌ కామ్‌గా ఉండే పర్సన్‌గా గుర్తుకు వస్తాడు. కానీ ఫ్యామిలీ స్టార్‌లో మాత్రం సుధీర్‌.. ఊర మాస్‌గా కనిపించబోతున్నట్లుగా ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. రింగ్‌ రియాజ్‌ సుధీర్‌ మాస్‌ లుక్‌ని రివీల్‌ చేశాడు. ఈ ఫొటో మీద సుధీర్‌ యాంకరింగ్‌ కెరీర్‌ ఎప్పుడు ప్రారంభం అయ్యింది.. ఎప్పటి వరకు కొనసాగింది అని రాసి ఉంది. కానీ రియాజ్‌ చివరి తేదీని కొట్టేసి.. బిగినింగ్‌ అని రాశాడు.

ఆ తర్వాత సుధీర్‌ ఎంట్రీ ఇచ్చి.. గుంటూరు కారం డైలాగ్‌ ఆట సూస్తావా అంటూ మాస్‌ డైలాగ్‌ చెప్పి.. షో మీద ఆసక్తిని పెంచాడు. ఇప్పుడు ప్రోమో తెగ వైరల్‌ అవుతుంది. ఇక త్వరలోనే సుధీర్‌ హోస్ట్‌ చేయబోయే ఫ్యామిలీ స్టార్‌ షో ప్రారంభం కానుంది. ఇక ప్రోమో చూసిన సుధీర్‌ ఫ్యాన్స్‌ ఫుల్లు ఖుషీ అవుతున్నారు. అన్నస్తోన్నాడు అని కామెంట్స్‌ చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş