iDreamPost
android-app
ios-app

Sudigali Sudheer: సీక్రెట్ గా ఆ అమ్మాయితో సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం? రష్మి కామెంట్స్ వైరల్..

  • Author Soma Sekhar Published - 11:48 AM, Sat - 1 July 23
  • Author Soma Sekhar Published - 11:48 AM, Sat - 1 July 23
Sudigali Sudheer: సీక్రెట్ గా ఆ అమ్మాయితో సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం? రష్మి కామెంట్స్ వైరల్..

సుడిగాలి సుధీర్.. బుల్లితెర సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ యాంకర్ కమ్ హీరో. మెజిషియన్ గా, కమెడియన్ గా, యాంకర్ గా, హీరోగా ఇలా తనలో ఉన్న అన్ని వేరియేషన్స్ చూపించి కోట్లాది మంది అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు. ఇక అమ్మాయిల్లో సుధీర్ పాలోయింగ్ చూస్తే.. పిచ్చెక్కిపోవడం ఖాయం. అంతలా మనోడు అమ్మాయిల డ్రీమ్ బాయ్ లా మారిపోయాడు. ప్రస్తుతం బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఇద్దరు యాంకర్ల పేర్లే ముందుగా వస్తాయి. అందులో సుధీర్ ఒకడు. గత కొంత కాలంగా సుధీర్ పెళ్లిపై చాలా వార్తలే వచ్చాయి. తాజాగా మరోసారి సుధీర్ పెళ్లి న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే? సుధీర్ సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడని.

సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇక ఈషోలో సుధీర్-రష్మి జోడీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతలా ఓ బుల్లితెర జోడీకి ఫ్యాన్ బేస్ ఉండటం మామూలు విషయం కాదు. ఇక వీరి మధ్య కెమిస్ట్రీ చూస్తే.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనేట్లుగా వర్కౌట్ అయ్యింది. దాంతో నిజంగానే రష్మి, సుధీర్ లు లవ్ లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను వారిద్దరు ఖండించారు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి సుధీర్ పెళ్లి వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సుధీర్ సీక్రెట్ గా తన మరదలు వరుస అయ్యే బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని, సీక్రెట్ గా వీరికి నిశ్చితార్థం కూడా అయ్యిందన వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దాంతో రష్మి, సుధీర్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. ఈ జోడీ పెళ్లి చేసుకుంటారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో గతంలో రష్మి చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తున్నారు సుధీర్ ఫ్యాన్స్. గతంలో సుధీర్ తో ప్రేమా, పెళ్లిపై రష్మి ఈ విధంగా మాట్లాడారు.

“మా మధ్య ఉన్నది ఎలాంటి రిలేషన్ షిప్ అయినా కావొచ్చు. అయితే దాని గురించి మీ అందరికి తెలుపలేను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలీదు. అందుకే కొన్ని విషయాలను నాలోనే దాచుకుంటా. అయితే ఏం జరిగినా.. అది మీ అందరికి తెలుస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం, ఇదంతా మేం అనుకుని చేయలేదు. మా జోడీ ఆన్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో.. ఆఫ్ స్క్రీన్ పై కూడా అలాగే ఉంటుంది. ఓ మ్యాజిక్ లా మా కెమిస్ట్రీ అభిమానులను ఆకర్షించింది” అంటూ గతంలో రష్మి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి ఈ వార్తలపై సుడిగాలి సుధీర్ ఏవిధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş