iDreamPost
android-app
ios-app

నాలా యాక్షన్ సీన్స్ ఎవ్వరూ చేయలేరు: సుధీర్ బాబు

  • Published Dec 05, 2023 | 12:20 PM Updated Updated Dec 05, 2023 | 1:07 PM

హీరో సుధీర్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘హరోంహర’. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరో సుధీర్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘హరోంహర’. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Published Dec 05, 2023 | 12:20 PMUpdated Dec 05, 2023 | 1:07 PM
నాలా యాక్షన్ సీన్స్ ఎవ్వరూ చేయలేరు: సుధీర్ బాబు

2024లో విడుదల కానున్న సుధీర్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ ‘‘ హరోంహరకి సంబంధించిన ప్రెస్ మీట్లో సుధీర్ బాబు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. ఈ సినిమా మీద వీర లెవెల్లో నమ్మకాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, తనలా ఎవ్వరూ యాక్షన్ సీక్వెన్స్ లు చెయ్యలేరని కూడా గట్టిగా చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. జ్యానేశ్వర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘‘హరోంహర’’ చిత్రం సుబ్రహ్మణ్యస్వామి లీలల అధారంగా కూడా రూపొందినట్టు దర్శకుడు చెప్పాడు.

మీడియా అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ దాదాపుగా చాలా కూల్‌గా సమాధానం చెప్పాడు సుధీర్‌ బాబు. వయొలెన్స్, యాక్షన్ సీన్ల గురించి చర్చ వచ్చినప్పుడు మాత్రం కొంత స్వరం పెంచాడు. ‘’ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడానికి హీరోకి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? హీరో ఎలా ఉండాలనుకుంటున్నారు?’’ అని మీడియాని ఎదురు ప్రశ్నించాడు. హరోంహర చిత్రంలో తాను చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు మరే హీరో చేయలేడని బల్లగుద్ది మరీ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

దర్శకుడు జ్యానేశ్వర్ అయితే సుధీర్ బాబుని పొగడ్తల్లో ముంచెత్తాడు. సుధీర్ లా కమిట్మెంట్ తో పనిచేయడం చాలా కష్టమని, యూనిట్ మొత్తం పడిన కష్టం ఒకెత్తైతే, సుధీర్ బాబు పడిన కష్టం ఒక్కటి ఒక ఎత్తు అని మెచ్చుకున్నాడు. ఒక ట్రైన్ ఎపిసోడ్ దాదాపుగా 20రోజుల పాటు చేశామని, సినిమా మొత్తం తమిళ కన్నడ బోర్డర్ ప్రాంతమైన కుప్పంలో జరిగిందని, సినిమాలో డైలాగ్ యాస కూడా కుప్పం యాసలో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాడు. ఈ సందర్భంగా ఆయనకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఓటీటీ వాళ్ల మీద నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టి తీశారా? ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ముందుగానే బడ్జెట్ ఇవ్వడం మానేశారు కదా? అనే ప్రశ్నకు సుధీర్ బాబు ఘాటుగానే స్పందించాడు. తన సినిమాలేవీ ఓటీటీలపైన ఆధారపడి జరగలేదని అన్నాడు. ఇంతకు ముందు తన సినిమాలు చేసిన సంస్థే ఇప్పుడు కూడా రెడీగా ఉందని వెల్లడించాడు. ఆ విషయంలో ఏ ఢోకాలేదని కూడా క్లియర్ చేశాడు. మరి, సుధీర్‌ బాబు లేటెస్ట్‌ సినిమా ‘‘ హరోంహర’’పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş