iDreamPost
android-app
ios-app

గ్యాప్ వచ్చినా సుధీర్-రష్మీల కెమిస్ట్రీ తగ్గలేదుగా! వైరల్ గా మారిన వీడియో!

  • Author ajaykrishna Updated - 04:58 PM, Wed - 9 August 23
  • Author ajaykrishna Updated - 04:58 PM, Wed - 9 August 23
గ్యాప్ వచ్చినా సుధీర్-రష్మీల కెమిస్ట్రీ తగ్గలేదుగా! వైరల్ గా మారిన వీడియో!

బుల్లితెరపై స్టార్ పెయిర్ అంటే.. సుధీర్ – రష్మీల తర్వాతే ఎవరైనా అనే రేంజ్ లో పేరు తెచ్చుకున్నారు. వీరి పెయిర్ కూడా అంతే పాపులర్ అయ్యింది. అందుకు కారణం.. వీరి మధ్య లవ్ ప్రపోజల్స్.. ఫన్.. డైలాగ్స్.. డ్యూయెట్ పెర్ఫార్మన్స్ లు మాత్రమే కాదు. వీళ్ళ మధ్య ఉండే కెమిస్ట్రీ అంత బాగా కుదిరింది. కాబట్టి.. జనాలు సుధీర్, రష్మీల జంటకు అంతగా కనెక్ట్ అయిపోయారు. కానీ.. కొన్నాళ్ళుగా సుధీర్, రష్మీ.. వేర్వేరు ఛానల్స్ లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. సుధీర్ ఏకంగా టీవీ ఛానల్ నుండి సినిమా హీరోగా బిజీ అయిపోయాడు. మరోవైపు రష్మీ.. సుధీర్ హోస్ట్ చేసి వెళ్లిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోని తన జబర్దస్త్ స్టైల్ లో ముందుకు తీసుకెళ్తోంది.

ఇక సుధీర్, రష్మీలను మళ్ళీ బుల్లితెరపై ఒకే స్టేజ్ లో చూడలేమేమో అని చాలా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. ఎందుకంటే.. వీళ్ళ పెయిర్ కి ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే.. మొత్తానికి ఫ్యాన్స్ నిరీక్షణకు బ్రేక్ వేస్తూ.. కొత్తగా ఓ ప్రోమో వదిలింది ప్రముఖ ఈటీవీ ఛానల్ యాజమాన్యం. ఈటీవీ ఛానల్ మొదలుపెట్టి.. 28 ఏళ్లు అవుతున్న సందర్బంగా.. గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ ప్రోగ్రాం ప్లాన్ చేసింది. ఈటీవీ బలగం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ప్రోగ్రాం.. త్వరలోనే ప్రసారం కాబోతుంది. అయితే.. తాజాగా ఈ ప్రోగ్రాంకి సంబంధించి ప్రోమో వదిలారు నిర్వాహకులు.

ప్రోమోలో యాంకర్ రష్మీ హోస్ట్ గా కనిపించింది. అలాగే ఈటీవీలో ఇప్పటివరకు సీరియల్స్, ప్రోగ్రాంస్ లో కనిపించిన వారందరూ హాజరై.. స్టేజ్ పై సందడి చేశారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. స్టార్ సుధీర్ ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. వచ్చిరాగానే.. రష్మీతో రెండు స్టెప్పులు వేసి.. తమ వింటేజ్ రొమాన్స్ ని బయటికి తీశారు. మేడం గారు ఎందుకో కోపంగా ఉన్నారు.. అని సుధీర్ రష్మీని చూసి అన్నాడు. ‘మరి నువ్వు వస్తావని ఇన్నాళ్లు ఎదురుచూశాను. ఇన్నిరోజులు ఎక్కడున్నావ్?’ అని రష్మీ అడిగింది. దానికి సుధీర్ స్పందించి.. “నేనెక్కడ ఉన్నా.. నువ్వు మాత్రం నా గుండెల్లో ఉంటావ్” అని సమాధానం చెప్పాడు. దీంతో ఒక్కసారిగా రష్మీ సిగ్గుపడింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి సుధీర్, రష్మీల జంట గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet