iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటిపై దాడి చేసిన వీధి పిల్లి!

  • Published Aug 09, 2023 | 1:43 PM Updated Updated Aug 09, 2023 | 1:43 PM
  • Published Aug 09, 2023 | 1:43 PMUpdated Aug 09, 2023 | 1:43 PM
ప్రముఖ నటిపై దాడి చేసిన వీధి పిల్లి!

సినిమా వాళ్లకు పెంపుడు జంతువులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న నటీ,నటుల దగ్గరినుంచి స్టార్‌ల వరకు ఇంట్లో తమకు నచ్చిన మూగ జీవాల్ని పెంచుకుంటూ ఉంటారు. పిల్లులు, కుక్కలు ఇతర జంతువుల్ని ఎంతో ఇష్టంగా పెంచుతూ ఉంటారు. కొంతమంది సినీ తారలు అప్పుడప్పుడు రోడ్లపై ఉన్న వీధి కుక్కల్ని, పిల్లుల్ని కూడా ముద్దు చేస్తూ ఉంటారు. ఇదే కొన్ని సార్లు వారిని ఇబ్బందుల్లో పడేస్తూ ఉంటుంది. తాజాగా, ప్రముఖ నటి రైజా విల్సన్‌ ఓ వీధి పిల్లి దాడిలో గాయపడ్డారు. ఆమె ఆ వీధి పిల్లిని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఉండగా.. అది పిచ్చిగా ప్రవర్తించింది. నటిపై దారుణంగా దాడి చేసింది. ఆమె చేతిని కొరికేసింది. దీంతో నటి చేతినుంచి ధారాపాతంగా రక్తం వచ్చింది.

రక్తం బాగా కారడంతో ఆమె ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ చికిత్స తీసుకుంది. తర్వాత తన చేతికి అయిన గాయాల తాలూకా ఫొటోలను, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘‘ వీధి పిల్లితో ఆడుతుండగా అది నన్ను కొరికింది. వీధి పిల్లులు కొరకటం మన ఇంట్లో పెంచుకునే పిల్లులు కొరికినట్లు కాదు’’అని పేర్కొన్నారు. పిల్లి దాడితో ఆమె మానసికంగా కొంత ఇబ్బందికి గురవుతున్నారు. జంతువుల్ని ఎంతో ఇష్టపడే ఆమెకు ఇది దారుణమైన అనుభవం కావటంతో ఒకరకంగా కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేస్తున్నారు.

Street cat attack on actress raiza

కాగా, రైజా విల్సన్‌ తమిళ బిగ్‌బాస్‌తో మంచి ఆదరణ తెచ్చుకున్నారు. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2017లో వచ్చిన ‘వేల ఇల్లాద పట్టాదారి2’ సినిమాతో వెండి తెరపైకి వచ్చారు. ఇప్పటి వరకు 8కిపైగా సినిమాల్లో నటించారు. ‘ది చేజ్‌’ అనే సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ సినిమా మొత్తం శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. మరి, ప్రముఖ నటి రైజా విల్సన్‌పై వీధి పిల్లి దాడి చేయటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio