iDreamPost
android-app
ios-app

మరో స్పెషల్ నంబర్ తో వచ్చేసిన తమన్నా.. ఈసారి జైలర్ కు మించి!

  • Published Jul 24, 2024 | 6:31 PM Updated Updated Jul 24, 2024 | 6:31 PM

Stree 2- Tamanna Aaj Ki Raat Song Release: మిల్కీ బ్యూటీ తమన్నా మరో స్పెషల్ సాంగ్ తో కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టడానికి వచ్చేస్తోంది. స్త్రీ 2 సినిమా నుంచి ఆజ్ కి రాత్ అనే వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.

Stree 2- Tamanna Aaj Ki Raat Song Release: మిల్కీ బ్యూటీ తమన్నా మరో స్పెషల్ సాంగ్ తో కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టడానికి వచ్చేస్తోంది. స్త్రీ 2 సినిమా నుంచి ఆజ్ కి రాత్ అనే వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.

  • Published Jul 24, 2024 | 6:31 PMUpdated Jul 24, 2024 | 6:31 PM
మరో స్పెషల్ నంబర్ తో వచ్చేసిన తమన్నా.. ఈసారి జైలర్ కు మించి!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పాన్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె తనదైన యాక్టింగ్ తో, డ్యాన్సులతో సినిమా ప్రేక్షకులను ఎప్పుడో తన అభిమానులుగా మార్చేసుకుంది. హీరోయిన్ అయినా.. సపోర్టింగ్ రోల్ అయినా.. స్పెషల్ నంబర్ అయినా తమన్నా మాత్రం రచ్చ రచ్చ చేసేస్తోంది. ప్రేక్షకులను అలరించేందుకు ఏ చిన్న స్కోప్ ఉన్నా ఆ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పుడు తమన్నా స్త్రీ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే స్త్రీ మూవీ సాధించిన సక్సెస్ ఏంటో చూశాం. అలాంటి మూవీకి సీక్వెల్ లో తమన్నా ఉండటం అంటే ప్రేక్షకులు వావ్ అంటున్నారు.

తమన్నా ఇటీవల సినిమాల కంటే పాటలతోనే ఎక్కువ అలరించింది.. వైరల్ కూడా అయ్యింది. తమన్నా పాట కోసం సినిమాకి కూడా వస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జైలర్ సినిమాలో ‘వాహ్.. నువ్వు కావాలయ్యా’ అనే సాంగ్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందరం చూశాం. ఆ తర్వాత బాక్ సినిమాలో రాశీ ఖన్నాతో కలిసి అచ్చో అచ్చో అచ్చొచ్చో అనే సాంగ్ కు తమన్నా వేసిన స్టెప్పులకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు వాటికి మించి ఈ స్త్రీ 2 సినిమాలో తమన్నా మెరుపులు మెరిపించనుంది. అందుకు సంబంధించి ‘ఆజ్ కి రాత్’ అనే సాంగ్ ని తీసుకొచ్చారు. ఆ సాంగ్ చూసిన తర్వాత స్త్రీ 2 సినిమాపై అంచనాలు మరితం పెరిగిపోతున్నాయి.

బాలీవుడ్ నుంచి వచ్చిన క్రేజీ హారర్ కామెడీ థ్రిల్లర్స్ లో ‘స్త్రీ’ సినిమా కచ్చితంగా ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ మూవీ హ్యూజ్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఆ హిట్టు మూవీకి సీక్వెల్ వస్తోంది. అయితే ఈసారి అంచనాలు భారీగా ఉంటాయి కాబట్టి.. మేకర్స్ కూడా దానికి తగినట్లుగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే తమన్నాతో స్పెషల్ నంబర్ కూడా ప్లాన్ చేశారు. నిజానికి ఈ మూవీలో తమన్నా సాంగ్ ఉందనే విషయం అందరికీ ముందే తెలుసు. ఇప్పుడు ఫుల్ సాంగ్ చూసిన తర్వాత అంతా మెస్మరైజ్ అయిపోతున్నారు. స్త్రీ 2 కథ విషయానికి వస్తే.. సేమ్ ప్లాట్ ఉండేలా కనిపిస్తోంది. మెయిన్ క్యారెక్టర్స్ ఎవరినీ ఛేంజ్ చేయలేదు. కథ కూడా దాదాపుగా సిమిల్ ర్ గానే ఉండేలా ఉంది. కానీ, ఈసారి కామెడీ మాత్రం డబుల్ ఇంపాక్ట్ ఉండేలా కనిపిస్తోంది. మరి.. మీకు ఈ ఆజ్ కి రాత్ సాంగ్ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom