iDreamPost
android-app
ios-app

అభిమానిని అవమానించిన స్టార్ సింగర్.. నెటిజన్లు ఫైర్

  • Published Feb 12, 2024 | 1:26 PM Updated Updated Feb 12, 2024 | 1:26 PM

ఈవెంట్స్ అనగానే సినీ సెలబ్రిటీలను చూసేందుకు ఊవిళ్లూరుతుంటారు ఫ్యాన్స్. అందుకే దూర భారమైనా.. డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తుంటారు. అయితే ఒక్కొక్కసారి వీరి అత్యుత్సాహం ఇబ్బందులకు గురి చేస్తుంది.

ఈవెంట్స్ అనగానే సినీ సెలబ్రిటీలను చూసేందుకు ఊవిళ్లూరుతుంటారు ఫ్యాన్స్. అందుకే దూర భారమైనా.. డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తుంటారు. అయితే ఒక్కొక్కసారి వీరి అత్యుత్సాహం ఇబ్బందులకు గురి చేస్తుంది.

  • Published Feb 12, 2024 | 1:26 PMUpdated Feb 12, 2024 | 1:26 PM
అభిమానిని అవమానించిన స్టార్ సింగర్.. నెటిజన్లు ఫైర్

ఇండస్ట్రీలోని సాధారణ వ్యక్తులను సెలబ్రిటీలను చేసేది ఫ్యాన్సే. సినిమా హిట్ చేయాలన్నా, ఫట్ చేయాలన్న వీరి చేతుల్లోనే ఉంటుంది. అందుకే చాలా మంది.. అభిమానుల్ని దేవుళ్లుగా సంబోధిస్తుంటారు. కొన్ని సార్లు ఫ్యాన్స్ వల్ల సినీ ప్రముఖులు ఇబ్బంది పడ్డ సంఘటనలు ఉన్నాయి. అయితే వారి పట్ల రూడ్‌గా ప్రవర్తించేందుకు కాస్త వెనకాడుతుంటారు సినీ సెలబ్రిటీలు. కానీ కొంత మంది సెలబ్రిటీలు అభిమానులపై విరుచుకుపడుతుంటారు. అలా చేసి ఇప్పుడు ఓ స్టార్ సింగర్ వార్తల్లో నిలిచాడు. ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ కుమారుడు ఆదిత్య నారాయణన్ ఒక ప్రేక్షకుడి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

చత్తీస్ గఢ్‌లో ఇటీవల ఓ ఈవెంట్ కండక్ట్ చేశాడు ఆదిత్య నారాయణన్. ఆ సమయంలో ఓ అభిమానిని అవమానించాడు.  వేదికపై ఉండగానే.. కింద్ర నిల్చొన్న ఓ ప్రేక్షకుడి వద్దకు వెళ్లి.. అతడి చేతిపై కొట్టి.. ఫోన్ లాక్కొని విసిరేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను దున్నేస్తోంది. ఇంతకు ఈ వీడియోలో ఏముందంటే..? భిలాయ్‌లోని రుంగ్తా కాలేజీలో ఆదిత్య మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుంది. వేదికపై ఈ స్టార్ సింగర్ పాట పాడుతున్నారు. అంతలో వేదిక కింద ఉన్న చాలా మంది అతడితో సెల్ఫీ తీసుకునేందుకు ఫోన్లు తీసుకుని పోటీ పడుతున్నారు. అంతలో ఓ వ్యక్తి చేయి.. అతడి ఫోన్ ఆదిత్యకు తాకింది. అంతే ఒక్కసారిగా పాడటం ఆపేసిన ఇండియన్ ఐడల్ హోస్ట్.. అతడి చేతిపై మైక్ తీసుకుని కొట్టాడు.

వెంటనే ఫోన్ లాక్కుని.. గుంపులోకి విసిరేశాడు. అనంతరం పాట అందుకున్నాడు. కాగా, ఆదిత్యపై మండిపడుతున్నారు నెటిజన్లు. గాయకుడి ప్రవర్తనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. హింసాత్మకమని, అతడో పొగరబోతు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఆదిత్య ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆదిత్య..హిందీలో అనేక సినిమాల్లో పాడాడు. అంతేకాకుండా పలు సింగిగ్ కాంపిటీషన్లకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన భార్య శ్వేతా అగర్వాల్ తెలుగులో పలు సినిమాల్లో నటించింది. అల్లరి మూవీతో పాటు రాఘవేంద్ర మూవీలో ప్రభాస్ సరసన ఆడిపాడింది. అనంతరం బాలీవుడ్ బాట పట్టి.. ఆదిత్య నారాయణన్ మనువాడింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş