iDreamPost
android-app
ios-app

Pushpa 2 Updates: సుకుమార్ గ్రాండ్ ప్లానింగ్ .. ప్రమోషన్స్ లో ఆ స్టార్ క్రికెటర్స్.. !

  • Published Nov 08, 2024 | 11:56 AM Updated Updated Nov 08, 2024 | 11:56 AM

Pushpa 2- Dhawan- David Warner- Maxwell: పుష్ప 2 కోసం దేశం అంతా ఎదురుచూస్తుంది. ఈ సినిమా గురించి ప్రతి రోజు ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. దాదాపు ప్రస్తుతం అంతా కూడా ప్రమోషన్స్ కు సంబంధిచిన అప్డేట్స్ ఏ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ప్రమోషన్స్ లో స్టార్ క్రికెటర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Pushpa 2- Dhawan- David Warner- Maxwell: పుష్ప 2 కోసం దేశం అంతా ఎదురుచూస్తుంది. ఈ సినిమా గురించి ప్రతి రోజు ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. దాదాపు ప్రస్తుతం అంతా కూడా ప్రమోషన్స్ కు సంబంధిచిన అప్డేట్స్ ఏ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ప్రమోషన్స్ లో స్టార్ క్రికెటర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Nov 08, 2024 | 11:56 AMUpdated Nov 08, 2024 | 11:56 AM
Pushpa 2 Updates: సుకుమార్ గ్రాండ్ ప్లానింగ్ .. ప్రమోషన్స్ లో ఆ స్టార్ క్రికెటర్స్.. !

పుష్ప 2 మీద ప్రతి రోజు ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. రీసెంట్ గా అయితే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ , అజనీష్ ను ఎంచుకున్నట్లు టాక్ నడుస్తుంది. మరి టీం లో దేవి ఉన్నాడా లేదా అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. మరి ఈ లాస్ట్ మినిట్ లో ముగ్గురు కలిసి వర్క్ చేస్తారా.. లేదా ఆ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మూవీ టీం నుంచి మాత్రం ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి అఫీషియల్ అనౌన్సుమెంట్ లేదు. చెప్పాలంటే ఇప్పుడు వారి దగ్గర ఇలాంటి అనౌన్సుమెంట్స్ ఇచ్చేంత టైం కూడా లేదు. సినిమా షూటింగ్ , డబ్బింగ్ , ఎడిటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులతో.. నిమిషం కూడా తీరిక లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో పగలు రాత్రి తేడా లేకుండా పని చేస్తుంది పుష్ప అండ్ కో. అయితే ఇప్పుడు ప్రేక్షకుల ఎదురుచూపులన్నీ కూడా ప్రమోషన్స్ కోసమే. ఎందుకంటే ఏ సినిమా సక్సెస్ కైనా ప్రమోషన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి.

అటు మూవీ టీం కూడా భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది. ఇండియా వైడ్ గా ఈ ఈవెంట్స్ ను నిర్వహించే స్కెచ్ వేసింది. నార్త్ ఇండియాలోని అన్ని స్టేట్స్ లో కూడా ఈ ఈవెంట్స్ జరుగనున్నాయి. పంజాబ్ లోని మొహాలీ , రాజస్థాన్ లో జైపూర్ , గుజరాత్ లో గాంధీ నగర్ , ఉత్తరప్రదేశ్ లో లక్నో , మహారాష్ట్ర లో ముంబై , బెంగాల్ లో బీహార్ , మధ్య ప్రదేశ్ లో ఓ ఇన్డోర్ ఈవెంట్ ను చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. పాట్నా లో జరిగి ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ ఉండబోతుందని సమాచారం. ఆ తర్వాత కలకత్తా లో మరో ఈవెంట్ ను చేయాలనీ రెడీ అవుతున్నారట. దానికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ ను కూడా రెడీ చేసినట్లు సమాచారం. ఇక ఈ ఈవెంట్స్ కు స్టార్ క్రికెటర్స్ సూర్యకుమార్ యాదవ్ , రింకు సింగ్ , అర్ష దీప్ సింగ్ సహా పలువురు క్రికెటర్స్ ను ఇన్వైట్ చేయనున్నట్లు తెలుస్తుంది.

పంజాబ్ ఈవెంట్ కు శిఖర్ ధావన్ , గాంధీ నగర్ లో ఈవెంట్ కు హార్దిక్ పాండ్యా , ముంబై లో ఈవెంట్ కు అజింక్య రహానే , అలాగే అమెరికాలో ఓ ఈవెంట్ ను ఎరేంజ్ చేసి.. అక్కడ గెస్ట్ గా క్రిస్ గేల్ ను ఇన్వైట్ చేయనున్నారట పుష్ప టీం. ఇక ఆస్ట్రేలియాలో జరిగే ఈవెంట్ కు మ్యాక్స్ వెల్ , డేవిడ్ వార్న‌ర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలా పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఈ స్టార్ క్రికెటర్స్ సందడి చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. కానీ ఒకవేళ మేకర్స్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. ఇదొక సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పి తీరాల్సిందే. అయితే మూవీ ప్రమోషనల్ ప్లాన్స్ పీక్స్ లో ఉన్నా.. వారి దగ్గర అంత సమయం మాత్రం లేదు. ఇక ఉన్న సమయంలో ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet giriştürk pornoMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet