సీక్వెల్ కి డైరెక్టర్ ఎందుకు మారాడు? ఎట్టకేలకు నిజం చెప్పేసిన సిద్ధు

Siddhu On Tillu Square Director Change: డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతోంది. ఈ మూవీ మార్చి 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే డైరెక్టర్ మారడంపై సిద్ధు అసలు విషయం రివీల్ చేశాడు.

Siddhu On Tillu Square Director Change: డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతోంది. ఈ మూవీ మార్చి 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే డైరెక్టర్ మారడంపై సిద్ధు అసలు విషయం రివీల్ చేశాడు.

స్టార్ బాయ్ సిద్ధు.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు, టిల్లు స్క్వేర్ సినిమా తెగ వైరల్ అవుతోంది. డీజే టిల్లు సినిమా పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేసిన రీసౌండింగ్ ఏంటో అందరూ చూశారు. ఆ మూవీకి సీక్వెల్ గా ఈ టిల్లు స్క్వేర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఫుల్ బజ్ నడుస్తోంది. మార్చి 29న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సిద్ధు ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అయితే సీక్వెల్ కి ఎందుకు డైరెక్టర్ మారాడు? అనే ప్రశ్న అయితే ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రశ్నకు స్టార్ బాయ్ తాజాగా సమాధానం చెప్పేశాడు. ప్రస్తుతం ఈ ఆన్సర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

టిల్లు స్క్వేర్ సినిమాకి అంతకంతకు హైప్ పెరిగిపోతోంది. ఇప్పటికే కుర్రాళ్లు అందరూ రాధికా రాధికా అంటూ తెగ గిపోతున్నారు. మరోవైపు అనుపమ పరమేశ్వరన్ కోసం కూడా తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే కంటెంట్ విషయంలో మాత్రం కాస్త నిరాశ చెందుతున్నారు. అయితే ఈ సీక్వెల్ కి సంబంధించి ఎప్పుడూ ఒక ప్రశ్న అయితే నడుస్తూనే ఉంది. సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ కి ఎందుకు డైరెక్టర్ మారిపోయాడు? డీజే టిల్లు మూవీకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే టిల్లు స్క్వేర్ కి మాత్రం మల్లిక్ రామ్ డైరెక్షన్ చేశాడు.

డైరెక్టర్ మారడంపై చాలానే ఊహాగానాలు వచ్చాయి. విమల్ కృష్ణకు ఈ మూవీ తీయడం ఇష్టంలేక తప్పుకున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే చివరకు విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్ రావడంపై సిద్ధు సమాధానం చెప్పేశాడు. అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాడు. “డీజే టిల్లుకి సీక్వెల్ తీయాలి అనుకున్నప్పుడు విమల్ కృష్ణ అందుబాటులో లేడు. ఆయన వేరే సినిమాకి కమిట్ అయ్యారు. అందుకే సీక్వెల్ ని విమల్ కృష్ణ చేయలేదు. అయినా ఫస్ట్ పార్ట్ చేసిన వాళ్లే రెండో పార్ట్ చేయాలి అనేం లేదు కదా. ఉదాహరణకు స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరోలు మారుతూ వచ్చారు. ఆడియన్స్ మాత్రం అందరినీ ఈక్వల్ గానే రిసీవ్ చేసుకున్నారు. మా ప్రాజెక్ట్ లో నన్ను మార్చలేదు. డైరెక్టర్ మారారు అంతే” అంటూ స్టార్ బాయ్ సిద్ధు అసలు విషయాన్ని రివీల్ చేశాడు.

ఇప్పటికైనా డైరెక్టర్ మార్పు అంశానికి, దానిపై వచ్చే పుకార్లకు తెర పడుతుందేమో చూడాలి మరి. సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీకి సంబంధిచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్ డేట్స్ చూస్తే కాస్త రొమాన్స్ ఎక్కువగానే ఉంటుందని అనుకున్నారు. కానీ, సెన్సార్ సర్టిఫికేట్ చూసిన తర్వాత అంతా రివర్స్ అయిపోయింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న చాలామంది ఆడియన్స్ నిరాశకు గురయ్యారు. కథ పరంగా మాత్రం మూవీ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని చెప్తున్నారు. మరి.. టిల్లు స్క్వేర్ మూవీకి డైరెక్టర్ మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments