iDreamPost
android-app
ios-app

ఆ పుణ్య క్షేత్రంలో SSMB 29 కథ మొదలు !

  • Published Nov 13, 2024 | 3:50 PM Updated Updated Nov 13, 2024 | 3:51 PM

SSMB29 Movie Story: మహేష్- రాజమౌళి కాంబినేషన్ కోసం ఎప్పటినుంచో అందరూ వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా కోసం తగినంత టైం తీసుకుంటున్నాడు. అటు మహేష్ కూడా ఎలాంటి కంగారు లేకుండా.. జక్కన్న పిలుపు కోసం ఎదుచూస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. అది కూడా ఈ సినిమా కథ గురించి.

SSMB29 Movie Story: మహేష్- రాజమౌళి కాంబినేషన్ కోసం ఎప్పటినుంచో అందరూ వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా కోసం తగినంత టైం తీసుకుంటున్నాడు. అటు మహేష్ కూడా ఎలాంటి కంగారు లేకుండా.. జక్కన్న పిలుపు కోసం ఎదుచూస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. అది కూడా ఈ సినిమా కథ గురించి.

  • Published Nov 13, 2024 | 3:50 PMUpdated Nov 13, 2024 | 3:51 PM
ఆ పుణ్య క్షేత్రంలో SSMB 29 కథ మొదలు !

సినిమా అభిమానులు.. సినీ విశ్లేషకులు..అందరూ  ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కాంబో ఇది. అదే మహేష్- రాజమౌళి కాంబినేషన్. జక్కన మేకింగ్ మీద ఇప్పటికే అందరికి ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఒక్కసారి జక్కన్న చేతికి ఏ హీరో అయినా చిక్కాడంటే ఇక ఆ హీరో రేంజ్ మారిపోవాల్సిందే. ముఖ్యంగా ఇది జక్కన్న మేక్ ఓవర్ అని ఆ హీరో లుక్స్ చూసి కాన్ఫిడెంట్ గా చెప్పేయొచ్చు. ఆ రేంజ్ లో తీర్చిదిద్దుతాడు జక్కన్న. అది మహేష్ లో ఇప్పటినుంచే స్పష్టంగా కనిపిస్తుంది . సోషల్ మీడియాలో మహేష్ లుక్స్ ఏ రకంగా వైరల్ అవుతున్నాయో తెలియనిది కాదు. ఇటీవల జక్కన్న షూట్ కోసం లొకేషన్ హంట్ ను కూడా స్టార్ట్ చేసాడు. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజమౌళి ఈ సినిమా కోసం తగినంత టైం తీసుకుంటున్నాడు. అటు మహేష్ కూడా ఎలాంటి కంగారు లేకుండా.. జక్కన్న పిలుపు కోసం ఎదుచూస్తున్నాడు. ఈలోగా వర్క్ షాప్స్ కూడా జరుగుతున్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. అది కూడా ఈ సినిమా కథ గురించి. ఈ సినిమా కథ అంతా కూడా వారణాసి నేపథ్యంలో మొదలవుతుందట. ఆ తర్వాత కథ సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుందట. వారణాసి షెడ్యూల్ మొత్తం ఒకటే సెట్ లో కంప్లీట్ చేయాలనీ రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. దానికోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ ను ఏర్పాటు చేయనున్నారట. మొదట షూటింగ్ ను ఇక్కడే స్టార్ట్ చేసి.. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాకు వెళ్లనున్నారు టీం. అక్కడ ఎక్కువగా అటవీ నేపథ్యంలో సాగే సన్నివేశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనున్నారు. అందుకోసమే జక్కన్న దట్టమైన అటవీ ప్రాంతాలున్న ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారు. ఏ ఏ సీన్స్ ను ఎక్కడెక్కడ షూట్ చేయాలి అనే విషయంపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. ఓ వైపు కెన్యా ఫారెస్ట్ లో విహార యాత్ర.. మరో వైపు వారణాసి బ్యాక్డ్రాప్ లో కథ ఉంటుందని టాక్. ఎక్కడా కూడా సింక్ లేదు.. మరి ఈ రెండిటిని రాజమౌళి ఎలా లింక్ చేస్తాడు. అసలు స్టోరీ ఎలా ముందుకు వెళ్తుంది. ఇవి తెలియాలంటే కొన్నేళ్లు వెయిట్ చేయాల్సిందే. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్. ఆల్రెడీ దీని మీద రకరకాల వార్తలు కూడా వచ్చాయి.

రాజమౌళి మాత్రం ప్రొపెర్ గా అఫీషియల్ అనౌన్సుమెంట్ ఇవ్వడం లేదులే.. కానీ, ఇచ్చి ఇవ్వనట్టు సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా హింట్స్ మాత్రం ఇచ్చేస్తున్నాడు . ఇక సినిమా షూట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో వేచి చూడాలి. మహేష్ బాబు హీరో.. దర్శకుడు రాజమౌళి.. క్యాస్టింగ్ గురించి ఇంతకుమించి ఏ అప్డేట్ లేదు. కానీ రీసెంట్ గా మాత్రం ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఏకంగా ఇండోనేషియా కు చెందిన ఓ హీరోయిన్ ను ఎంచుకునే ప్లాన్ లో ఉన్నాడట జక్కన్న. ఆల్రెడీ ఆమెతో ఫోటోషూట్ ను కూడా నిర్వహించారట. కానీ ఇంకా ఫైనల్ చేయలేదని సమాచారం. ఇండోనేషియా హీరోయిన్ అంటే జక్కన్న ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక మిగతా క్యాస్టింగ్ సంగతైతే తెలియదు కానీ.. కచ్చితంగా రాజమౌళి మాత్రం ఈసారి సిల్వర్ స్క్రీన్ మీద.. కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడని చెప్పి తీరాల్సిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet