iDreamPost
android-app
ios-app

పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ భామ..?

  • Published Nov 02, 2024 | 12:03 PM Updated Updated Nov 02, 2024 | 12:03 PM

Pushpa 2 Updates: పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ అంటే ఐటెం సాంగ్ ఏ.. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామ పేరు వినిపించింది. కానీ ఇప్పడు తెలుగు హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో చూసేద్దాం.

Pushpa 2 Updates: పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ అంటే ఐటెం సాంగ్ ఏ.. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామ పేరు వినిపించింది. కానీ ఇప్పడు తెలుగు హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో చూసేద్దాం.

  • Published Nov 02, 2024 | 12:03 PMUpdated Nov 02, 2024 | 12:03 PM
పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ భామ..?

సరిగ్గా ఇంకో నెల రోజుల్లో పుష్ప క్రియేట్ చేయబోయే సినీ సునామి కళ్ళ ముందు కనిపించబోతుంది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి బ్యాలెన్స్ ఉన్న వాటిలో.. ముఖ్యమైంది ఐటెం సాంగ్. దర్శకుడు సుకుమార్ ఈ సాంగ్ లో హీరోయిన్ కోసం చేసిన సుదీర్ఘ వేట ఎట్టకేలకు ముగిసినట్లు టాక్. మొదట ఈ సాంగ్ కోసం త్రిప్తి డిమ్రి పేరు వినిపించింది. ఆ తర్వాత నిన్న మొన్నటి వరకు శ్రద్ధా కపూర్‌ పేరు తెగ వైరల్ అయింది. ఈ బాలీవుడ్ భామ దాదాపు కన్ఫర్మ్ అనే అనుకున్నారంత. ఆమె కూడా ఒకే చెప్పినట్లు… ఇంకా షూట్ చేయడమే బ్యాలెన్స్ అన్నట్లు టాక్ వచ్చింది. ఇంకా సాంగ్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు.. ఇప్పుడు ఓ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు. కారణాలు ఏమై ఉంటాయో ఏమో తెలియదు కానీ, ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం టాలీవుడ్ భామ శ్రీలీల ను ఆశ్రయించారట మేకర్స్ .

ఇంకా మూవీ టీం అధికారికంగా ప్రకటించలేదు. కానీ , దాదాపు ఒప్పందాలు అయితే అయ్యాయని సమాచారం. పుష్ప పార్ట్ 1 లో సైతం సమంత ఉందనే వార్తా లేట్ గానే బయటకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా శ్రీలీల తో పుష్పరాజ్   అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. శ్రీలీల, బన్నీ కలిసి డ్యాన్స్ చేస్తే.. పోతారు మొత్తం పోతారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే.. ఇక థియేటర్ లో ఈ సాంగ్ కు సీట్స్ లో ఎవరు కూర్చోరేమో. ఆల్రెడీ గుంటూరు కారం మూవీలో కుర్చీ మడతపెట్టి సాంగ్ లో.. తన డ్యాన్స్ తో రికార్డ్స్ మడతపెట్టింది శ్రీలీల. తీసింది కొద్దీ సినిమాలే అయినా కూడా.. ఈ అమ్మడి డ్యాన్స్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అటు ఐకాన్ స్టార్ స్టెప్పుల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే.. జరిగే బీభత్సం అంతా ఇంతా కాదు. సరిగ్గా ఆడియన్స్ కు కావాల్సిన మాస్ మసాలాను ఈ ఇద్దరే ఇవ్వగలరేమో అనే రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి అసలైన లాంఛనం కంప్లీట్ అవుతుంది. దాదాపు ఈ సినిమాకు అన్ని ఇబ్బందులు తొలగిపోయినట్లే. అలాగే ఓవర్సీస్ లో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందు రోజు రాత్రి నుంచి ప్రీమియర్ షోస్ పడతాయి. ఇప్పటికే కనివిని ఎరుగని రేంజ్ లో.. ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్లు ట్రేడ్ వర్గలా మతి పోగొడుతున్నాయి. అటు నార్త్ లో కూడా మంచి బజ్ సంపాదించుకుంటుంది. ఇక ఈ సాంగ్ కాస్త పూర్తయితే.. రావాల్సిన అప్డేట్స్ అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రేక్షకులంతా బన్నీ , శ్రీలీల కలిసి ఎలాంటి స్టెప్పులేస్తారా అని.. ఎదురుచూస్తున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibom