iDreamPost
android-app
ios-app

నేనూ, గెటప్ శ్రీను కలిసి ఆడిషన్స్ కి తిరిగేవాళ్లం: స్టార్ హీరో

  • Author Soma Sekhar Published - 09:31 PM, Sat - 11 November 23

అవకాశాల కోసం నేనూ, గెటప్ శ్రీను ఇద్దరం కలిసి ఆడిషన్స్ కు వెళ్లేవాళ్లమని చెప్పుకొచ్చాడు ఓ స్టార్ హీరో. 'మా ఊరి పొలిమేర 2' సినిమా సక్సెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేశాడు ఈ హీరో.

అవకాశాల కోసం నేనూ, గెటప్ శ్రీను ఇద్దరం కలిసి ఆడిషన్స్ కు వెళ్లేవాళ్లమని చెప్పుకొచ్చాడు ఓ స్టార్ హీరో. 'మా ఊరి పొలిమేర 2' సినిమా సక్సెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేశాడు ఈ హీరో.

  • Author Soma Sekhar Published - 09:31 PM, Sat - 11 November 23
నేనూ, గెటప్ శ్రీను కలిసి ఆడిషన్స్ కి తిరిగేవాళ్లం: స్టార్ హీరో

ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వారందరు దాదాపుగా అవకాశాల కోసం ఆఫీసులు చుట్టు తిరిగిన వారే. సినీ కెరీర్ లో తాము ఎదుర్కొన్న కష్టాలను సందర్భం వచ్చినప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు సదరు నటీ, నటులు. తాజాగా తన సినిమా జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు ఓ టాలీవుడ్ యంగ్ హీరో. అవకాశాల కోసం నేనూ, గెటప్ శ్రీను ఇద్దరం కలిసి ఆడిషన్స్ కు వెళ్లేవాళ్లమని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ హీరో. ‘మా ఊరి పొలిమేర 2’ సినిమా సక్సెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేశాడు ఈ హీరో.

షార్ట్ ఫిల్మ్ లో చిన్న చిన్న పాత్రలు చేయడంతో తన కెరీర్ ను ప్రారంభించి.. ఇప్పుడు సోలో హీరోగా ఎదిగారు శ్రీవిష్ణు. కెరీర్ ప్రారంభంలో చిన్న క్యారెక్టర్లతో పాటుగా సైడ్ ఆర్టిస్ట్ గా చేస్తూ.. తనలో ఉన్న నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ తర్వాత నెమ్మదిగా హీరో పాత్రలు రావడం, యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం మనందరికి తెలిసిన విషయమే. అయితే తన కెరీర్ లో జరిగిన కొన్ని ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా జరిగిన ‘మా ఊరి పొలిమేర 2’ మూవీ సక్సెస్ మీట్ లో శ్రీవిష్ణు మాట్లాడారు.

“ఈ చిత్రంలో నటించిన చాలా మంది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చిత్రం శ్రీను, గెటప్ శ్రీను, సత్యం రాజేష్, రవివర్మ ఇలా అందరితో నాకు దగ్గరి పరిచయం ఉంది. మీ టీమ్ అందరూ నాకు బాగా కావాల్సిన వాళ్లే. మీతో కలిసి కొన్ని సినిమాలు కూడా పనిచేశాను. గెటప్ శ్రీనుతో అయితే నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. 15 సంవత్సరాల క్రితం నేనూ, గెటప్ శ్రీను కలిసి ఆడిషన్స్ కు వెళ్లేవాళ్లం. ఇక నేను ఫస్ట్ యాక్ట్ చేసిన పెద్ద నటుడు సత్యం రాజేష్ అన్న. ఆ షూటింగ్ లో తొలిరోజు మధ్యాహ్నం నన్ను పిలిచి నువ్వు గ్యారంటీగా పెద్ద హీరోవి అవుతావు అంటూ సత్యం రాజేష్ అన్న చెప్పాడు” అని చెప్పుకొచ్చాడు శ్రీవిష్ణు. ఇక మా ఊరి పొలిమేర మరో రెండు వారాలు థియేటర్లలో ఉంటుందని, ఇంకా మూవీ చూడని వారు వెళ్లి చూడాలని శ్రీవిష్ణు అభిమానులను కోరాడు.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabet