iDreamPost
android-app
ios-app

SPY Day 1 Collections: నిఖిల్ సంచలనం.. తొలి రోజే అన్ని కోట్లా?

  • Author Soma Sekhar Published - 04:20 PM, Fri - 30 June 23
  • Author Soma Sekhar Published - 04:20 PM, Fri - 30 June 23
SPY Day 1 Collections: నిఖిల్ సంచలనం.. తొలి రోజే అన్ని కోట్లా?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది టాలెంటెడ్ యంగ్ హీరోలు ఉన్నారు. అయితే అందులో కొంత మంది మాత్రమే హిట్లతో దూసుకెళ్తున్నారు. అలా వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోల్లో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. వరుస హిట్లతో మంచి జోరుమీదున్న నిఖిల్ నుంచి.. తాజాగా వచ్చిన చిత్రం ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ మెగాఫోన్ పట్టి తెరకెక్కించగా.. ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. ఇక జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు ప్రేక్షకుల నుంచి మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఓపెనింగ్స్ కు భారీ దెబ్బ పడుతుందని అందరు భావించారు. కానీ అనూహ్యంగా నిఖిల్ కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టింది స్పై మూవీ. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. మరి నెగెటీవ్ టాక్ వచ్చినా గానీ ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

స్పై డే 1 కలెక్షన్స్:

  • నైజాం – రూ. 1.72 కోట్లు
  • సీడెడ్ – రూ. 56 లక్షలు
  • ఉత్తరాంధ్ర – రూ. 54 లక్షలు
  • కృష్ణ – రూ. 25 లక్షలు
  • ఈస్ట్ గోదావరి – రూ.33 లక్షలు
  • వెస్ట్ గోదావరి – రూ. 22 లక్షలు
  • గుంటూరు – రూ. 48 లక్షలు
  • నెల్లూరు – రూ. 18 లక్షలు
  • రెస్టాఫ్ ఇండియా – రూ. 46 లక్షలు
  • ఓవర్సిస్ – రూ.1.28 కోట్లు
  • వరల్డ్ వైడ్ – రూ. 6.02 కోట్లు(షేర్)
  • వరల్డ్ వైడ్ – రూ. 11.70 కోట్లు(గ్రాస్)

స్పై మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.17.50 కోట్ల మేర ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18.50 కోట్లతో బరిలోకి దిగింది. నెగిటీవ్ టాక్ ఉన్నాగానీ.. తొలి రోజే నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది. నిఖిల్ కార్తికేయ 2 తొలి రోజు రూ. 3.50 కోట్లు రాబట్టగా.. తాజాగా ఈ రికార్డును బ్రేక్ చేశాడు నిఖిల్. స్పై మూవీ మరో రూ. 12.45 కోట్లను రాబట్టితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. రాబోయే రోజులు వీకెండ్స్ కాబట్టి.. నిఖిల్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş