iDreamPost
android-app
ios-app

నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా.. ఆనిమల్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

  • Published Dec 23, 2023 | 4:42 PM Updated Updated Dec 23, 2023 | 4:42 PM

సందీప్ రెడ్డి వంగా-రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన మూవీ ఆనిమల్. డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తండ్రి, కొడుకుల ఎమోషన్లను ఫిదా అయిపోయింది బాలీవుడ్ అభిమానులు.

సందీప్ రెడ్డి వంగా-రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన మూవీ ఆనిమల్. డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తండ్రి, కొడుకుల ఎమోషన్లను ఫిదా అయిపోయింది బాలీవుడ్ అభిమానులు.

  • Published Dec 23, 2023 | 4:42 PMUpdated Dec 23, 2023 | 4:42 PM
నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా.. ఆనిమల్ హీరోయిన్  కామెంట్స్ వైరల్!

ఆనిమల్ మేనియా ఇంకా చాలా మంది మైండ్లలో నుండి పోనే లేదు. ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరీ. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా టేకింగ్ స్టైల్, మ్యూజిక్, సాంగ్స్‌కు బీ టౌన్ పిచ్చెక్కిపోయింది. రణబీర్ కపూర్, బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రధారులుగా చేసిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టే దిశగా పరుగులు పెడుతుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా నటించింది నేషనల్ క్రష్ రష్మిక. కానీ ఆమె కన్నా అందరి మదిలో రిజిస్టర్ అయ్యింది జోయా అలియాస్ త్రిప్తి దిమ్రీ. ఈమెను చూశాక.. రష్మికకు ఉన్న నేషనల్ క్రష్ ట్యాగ్ ఈమెకు కూడా ఇచ్చేశారు ఫ్యాన్స్.

రణబీర్ కపూర్ రెండో భార్య పాత్రలో కనిపిస్తుంది త్రిప్తి దిమ్రీ. బోల్డ్ అండ్ శృంగారభరితమైన సన్నివేశాల్లో రెచ్చిపోయింది. ఆమె నటనకు ఫిదా అయిపోయారు మూవీ లవర్స్. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కుర్రకారు ఆమెకు గుండెల్లో గుడి కట్టేశారు. ఆమె కోసమే సినిమాకు వెళుతున్నారనడంలో అతిశయోక్తి కాదు.  ఈ మూవీతో ఆమెకు వచ్చిన స్టార్ డమ్‌ను వినియోగించుకునే పనిలో పడింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆనిమల్ మూవీ తనకు ఎంతో గుర్తింపునిచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. ఈ పాపులారిటీతో డైలీ తనకు లెక్కించలేనన్నీ కాల్స్, మేసేజెస్ వస్తున్నాయట.

రాత్రి, పగలు అని తేడా లేకుండా ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెబుతుంది. వాటన్నింటికి రిప్లై ఇవ్వడంతో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నట్లు వెల్లడించింది. అయినా సరే అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకి ఎంతో ఆనందంగా ఉందని చెబుతుంది త్రిప్తి. అలాగే రణబీర్ కపూర్ అమేజింగ్ యాక్టర్ అని, తను బాగా సపోర్ట్ చేశాడని వెల్లడించింది. ఇంకా థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీలో సాంగ్స్ ఇప్పటికే వీడియో రూపంలో రిలీజ్ అయ్యాయి. ఇందులో రణబీర్, త్రిప్తి మధ్య జరిగే రొమాన్స్ సాంగ్ కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. దీన్ని చూశాక కూడా చాలా మంది సినిమా వాచ్ చేసేందుకు వెళుతున్నారట. మరీ ఈ మూవీలో ఆమె యాక్టింగ్ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom