iDreamPost
android-app
ios-app

బుల్లితెరలో విషాదం.. ప్రముఖ యాంకర్ మృతి

  • Published Jul 27, 2024 | 6:42 PM Updated Updated Jul 27, 2024 | 6:42 PM

ఇండస్ట్రీని విషాదాలు వీడటం లేదు. బిగ్ స్క్రీనే కాదు బుల్లితెరను కూడా మరణాలు వెంటాడుతున్నాయి. నిన్న కన్నడ యాంకర్ దివ్య తండ్రి మరణించాడు. ఇప్పుడు మరో టీవీ యాంకర్ కన్నుమూసింది.

ఇండస్ట్రీని విషాదాలు వీడటం లేదు. బిగ్ స్క్రీనే కాదు బుల్లితెరను కూడా మరణాలు వెంటాడుతున్నాయి. నిన్న కన్నడ యాంకర్ దివ్య తండ్రి మరణించాడు. ఇప్పుడు మరో టీవీ యాంకర్ కన్నుమూసింది.

  • Published Jul 27, 2024 | 6:42 PMUpdated Jul 27, 2024 | 6:42 PM
బుల్లితెరలో విషాదం.. ప్రముఖ యాంకర్ మృతి

వెండితెరనే కాదు.. బుల్లితెరను వరుస విషాదాలు వీడటం లేదు. టీ సిరీస్ చైర్ పర్సన్, యానిమల్ నిర్మాతల్లో ఒకరైన కృష్ణ కుమార్ ఏకైక కుమార్తె తీషా కుమార్ అతి చిన్న వయస్సులో మరణించిన సంగతి విదితమే. 20 ఏళ్లకే క్యాన్సర్ మహమ్మారి ఆమెను కబళించింది. ప్రముఖ కన్నడ టీవీ, సినీ దర్శకుడు వినోద్ దొండాలే ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ తల్లి మేకా ఇరానీ మృతి చెందింది. అలాగే ప్రముఖ కన్నడ యాంకర్ దివ్య ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి మరణించగా.. తనే అంత్యక్రియలు నిర్వహించింది. ఇప్పుడు ఓ న్యూస్ యాంకర్ మరణించింది. ఈమె కూడా క్యాన్సర్ బాధితురాలే.

ప్రముఖ తమిళ న్యూస్ ఛానెల్లో రీడర్‌గా వర్క్ చేస్తున్న సౌందర్య ఆముదమొళి కన్నుమూసింది. సౌందర్య ఆముదమొళి న్యూస్ తమిళ్ 24×7లో న్యూస్ రీడర్‌గా వర్క్ చేస్తుంది. గత ఆరు నెలలుగా ఆమె బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతుంది. చికిత్స పొందుతూ జులై 26న తుది శ్వాస విడిచింది. అయితే ఆమె చికిత్స కోసం ఆర్థిక సాయం కోరగా.. టెలివిజన్ యాజమాన్యం, తమిళ న్యూస్ రీడర్స్ అసోసియేషన్ నుండి రూ. 5.51 లక్షల ఆర్థిక సాయంతో పాటు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా రూ. 50 లక్షల సాయం అందించారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందింది.

గత కొన్ని నెలల క్రితం వరకు తమిళ యాసతో ఉత్కంఠతో వార్తలు చదివే న్యూస్ యాంకర్ సౌందర్య లేదని తెలిసి నివ్వెరపోతున్నారు. బాధను వ్యక్తం చేస్తున్నారు. మేలో ఆమె తన సోషల్ మీడియా ద్వారా హెల్త్ అప్టేడ్ ఇస్తూ.. తన చికిత్స కోసం ఆర్థిక సాయం కోరింది. ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోలను పంచుకుంటూ..అకౌంట్ డిటైల్స్ షేర్ చేసింది. యాజమాన్యం, అసోసియేషన్, ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా పలువురు ఆమెకు సాయం చేశారు. తిరిగి కోలుకుని వచ్చి.. మళ్లీ తనదైన హవ భావాలతో ఆకట్టుకుంటుంది అనుకునేలోపు కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Sowndarya Amudhamozhi (@sowndarya_amudhamozhi)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet