sai
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సింగర్ ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నారు.
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సింగర్ ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నారు.
sai
ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. కొందరు అనారోగ్యాలతో తుదిశ్వాస విడుస్తుంటే.. మరికొందరు హార్ట్ స్ట్రోక్, రోడ్డు ప్రమాదాల భారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ పాప్ సింగర్ హఠాన్మరణం చెందింది. దక్షిణ కొరియా సింగర్ పార్క్ బొ రామ్ (30) మరణించింది. ఆమె ఆకస్మిక మరణంతో ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న పార్క్ బొ రామ్ చిన్న వయసులోనే కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా పార్క్ బొ రామ్ మరణానికి గల కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదు. మరణానికి కొద్ది గంటల ముందు ఆమె ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఆ కార్యక్రమంలో ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించింది. ఆపై రాత్రి 9.55 గంటలకు రెస్ట్ రూంకు వెళ్లి ఎంతకీ తిరిగిరాలేదు. దీంతో ఆమె స్నేహితులు వెళ్లి చూడగా సింక్‌పై అపస్మారక స్ధితిలో పడి ఉన్నట్లు వారు తెలిపారు. ఈ ఘటన ఏప్రిల్ 11 అర్ధరాత్రి చోటుచేసుకుంది. కాగా పార్క్ బొ రామ్ 2010లో 17 ఏండ్ల వయసులో తన పాటలతో ప్రపంచానికి పరిచయమైంది. సూపర్ స్టార్ కే2 పాటల పోటీలో తన టాలెంట్‌తో పాపులారిటీ పొందింది. 2014లో తన సింగిల్ బ్యూటిఫుల్ రిలీజ్‌తో పాప్ మ్యూజిక్ పరిశ్రమలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ఆమె ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది.
Park Boram has passed away at the age of 30. pic.twitter.com/E2PfluIwfc
— Kpop Charts (@kchartsmaster) April 11, 2024