iDreamPost
android-app
ios-app

సొంతం మూవీ సెకండ్ హీరోయిన్.. బాబోయ్ ఇది మామూలు ట్రాన్స్ఫర్మేషన్ కాదుగా

  • Published May 30, 2024 | 9:26 PM Updated Updated May 30, 2024 | 9:26 PM

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అవుట్ అండ్ అవుడ్ కామెడీ, ప్రేమ కథా చిత్రం సొంతం. ఇందులో ఆర్యన్ రాజేష్, నమిత హీరో హీరోయిన్లు. ఇందులో రోహిత్ కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే. అతడి గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపించిన బ్యూటీ గుర్తుందా...

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అవుట్ అండ్ అవుడ్ కామెడీ, ప్రేమ కథా చిత్రం సొంతం. ఇందులో ఆర్యన్ రాజేష్, నమిత హీరో హీరోయిన్లు. ఇందులో రోహిత్ కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే. అతడి గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపించిన బ్యూటీ గుర్తుందా...

  • Published May 30, 2024 | 9:26 PMUpdated May 30, 2024 | 9:26 PM
సొంతం మూవీ సెకండ్ హీరోయిన్.. బాబోయ్ ఇది మామూలు ట్రాన్స్ఫర్మేషన్ కాదుగా

శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ది బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటి సొంతం. హాయ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్, నమిత హీరో, హీరోయిన్లుగా నటించారు. 2002లో వచ్చిన ఈ మూవీ ఓకే అనిపించుకుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే బాధ్యతలను మోసాడు దర్శకుడు. జెడీ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కించారుు. ఇందులో చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. సునీల్, చిత్రం శ్రీను, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెట్టిస్తుంటాయి. ఇందులో అడవి శేష్ ఓ గెస్ట్ పాత్రలో కనిపిస్తాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ది బెస్ట్ మ్యూజిక్ అల్బమ్స్‌లో ఒకటి సొంతం. ఇందులో సాంగ్స్ ఇప్పటికీ వీనుల విందుగా ఉంటాయి.

‘తెలుసునా, తెలుసునా మనసుకు తొలి కదలిక’, ‘ఈ నాటి వరకు నా గుండె లయకు’, ‘పుడు నీకు నే తెలుపనిది’, ‘నాయుడో నాయుడో’ పాటలు హిట్స్ అందుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాటలన్నీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్స్. అప్పటి జనరేషన్‌ను మాత్రమే కాకుండా ఇప్పటి తరాన్ని కూడా అలరిస్తున్నాయి ఈ సాంగ్స్. ఇక ఇందులో స్నేహానికి ప్రాణం ఇస్తుంటారు మన హీరో. అతడి స్నేహితులుగా నటించారు రోహిత్, నమిత. ఇందులో నమిత నాజుగ్గా కనిపించింది. ఆ తర్వాత బొద్దుగా మారిపోయింది. ఇందులో రోహిత్‌ను ప్రేమించే అమ్మాయి గుర్తుందా. అందులో సౌమ్య పాత్రలో సెకండ్ హీరోకి హీరోయిన్ గా నటించింది. ఆమె ఎవరు.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

సొంతం మూవీలో రోహిత్ ప్రేయసిగా కనిపించిన ఆ నటి పేరు నేహా పెండ్సే. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ చేసిన నేహా.. టీవీ రంగంలో రాణించింది. యుక్త వయస్సు వచ్చే సరికి ఆమె నటించిన తొలి సినిమా సొంతం. సొంతంలో నటించే సమయానికి ఆమె వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. మౌనం పేసియాదే అనే తమిళ చిత్రంలో నటించింది. ఇది కాకుండా తెలుగులో అడపా దడపా సినిమాలు చేసింది. గోల్ మాల్, పొదరిల్లు, వీధి రౌడీ వంటి చిత్రాలు చేసింది. మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ చిత్రాల్లో యాక్ట్ చేసింది. 2008లో వచ్చిన వీధి రౌడీ తర్వాత తెలుగులో కనిపించలేదు 2020లో శార్దూల్ సింగ్ బయాస్ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. సొంతం మూవీలో అందమైన కట్టుబొట్టుతో అలరించిన ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో తన ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş