iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి.. నటి నుండి డైరెక్టర్‌గా .. ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Sep 14, 2024 | 4:55 PM Updated Updated Sep 14, 2024 | 4:55 PM

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా.. నటిగా సక్సెస్ అయ్యింది. ఎన్నో చిత్రాల్లో తన కామెడీతో కితకితలు పుట్టించింది. తర్వాత ట్రాక్ మార్చి డైరెక్టర్ గా రాణిస్తుంది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా.. నటిగా సక్సెస్ అయ్యింది. ఎన్నో చిత్రాల్లో తన కామెడీతో కితకితలు పుట్టించింది. తర్వాత ట్రాక్ మార్చి డైరెక్టర్ గా రాణిస్తుంది. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Sep 14, 2024 | 4:55 PMUpdated Sep 14, 2024 | 4:55 PM
ఈ చిన్నారి.. నటి నుండి డైరెక్టర్‌గా .. ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో బాబ్డ్ హెయిర్‌తో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..? ఇప్పుడో స్టార్ యాక్ట్రెస్. కేవలం నటి మాత్రమే కాకుండా ఆర్జే, కమెడియన్, అసిస్టెంట్ డైరెక్టర్, ఎంటర్ ప్రెన్యూయర్. తెరపై తన కామెడీతో నవ్వులు నవ్వులు పూయించిన లేడీ కమెడియన్. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ పై దృష్టి సారించడంతో సినిమాలు తగ్గించేసింది. ఇంతకు ఆమె ఎవరంటే స్వప్నిక రెడ్డి వర్ధనపు. ఇలా అంటే ఎవరికీ గుర్తుకు రాదు కానీ. ‘మీరు వింటున్నారు.. సూపర్ హిట్ 93.5 ఎస్ఎఫ్ఎం. ది ఈజ్ స్వప్నిక, వినండి, వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా’ అనేది ఈమెనే. తెలుగులో ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌గా అలరించింది ఈమె. గుంటూరు, విజయవాడలో పెరిగింది. ఆమె ఫుట్ బాల్ ప్లేయర్ కూడా. చిన్న వయస్సులోనే 93.5 రెడ్ ఎఫ్ఎం (అప్పట్లో ఎస్ఎఫ్ఎం)లో ఆర్జేగా రాణించింది.

ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే హైదరాబాద్ వచ్చిన ఆమె.. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేయగా.. యాక్టర్‌గా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రంలో ఆఫర్ వచ్చింది. ప్రభాస్ చెల్లెలిగా ఆఫర్ వస్తే కాదని, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. నారా రోహిత్ హీరోగా సోలో చిత్రంలో నటించింది. శ్రీనివాసరెడ్డి.. స్వప్నిక మధ్య సన్నివేశాలు చాలా ఫన్నీగా సాగిపోతుంటాయి. జబర్థస్త్, నిప్పు, ఛలో, ఐయామ్ ఇన్ లవ్, చాణక్య వంటి చిత్రాల్లో నటించింది. ఎన్నో సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. అయితే తను ఇండస్ట్రీలోకి వచ్చింది యాక్టింగ్ కోసం కాదని, డైరెక్టర్ కావాలని భావించి.. అటు వైపుగా షిఫ్ట్ అయ్యింది. ఓ బేబీ మూవీ కోసం లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని నందినీ రెడ్డి ప్రకటించగా.. తానే వెళ్లి.. ఆ ఆఫర్ తనకు ఇవ్వాలని కోరింది. అందుకు నందిని ఓకే చెప్పడంతో డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌లో చేరింది.

Lady Director

అలా అనిల్ రావిపూడి- మహేష్ బాబు కాంబోలో వచ్చిన సర్కారి వారి పాటకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసింది. అంతేకాదు.. ఆమెకు మెగాస్టార్ చిరంజీవి అంటే అమితమైన ఇష్టం. అతడితో వర్క్ చేయాలని ఊవిళ్లూరుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది స్వప్నిక. అలానే శర్వానంద్- కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చిన మనమే చిత్రానికి కూడా వర్క్ చేసింది ఆమె. త్వరలో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తన దగ్గర నాలుగు, ఐదు కథలు సిద్ధం చేసుకున్నట్లు గతంలో వెల్లడించింది ఈ నటి కమ్ అసిస్టెంట్ డైరెక్టర్. అలాగే ఎంటర్ ప్రెన్యూయర్ గానూ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఆమె పదేళ్ల క్రితం బాలకృష్ణ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమెకు ఓ బాబు అని తెలుస్తుంది. త్వరలో మెగాఫోన్ పట్టి..లేడీ డైరెక్టర్‌గా రాణించాలని ఆశిద్దాం.

 

View this post on Instagram

 

A post shared by Swapnika vardhanapu (@swapnikareddy_misha)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabet