iDreamPost
android-app
ios-app

OTTలోకి బిగ్‌బాస్ సోహెల్ బూట్‌క‌ట్ బాల‌రాజు – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Published Feb 20, 2024 | 12:52 PM Updated Updated Mar 14, 2024 | 5:00 PM

Bootcut Balaraju OTT: బిగ్‌ బాస్‌ ఫేమ్ సోహెల్ ఇటీవలే బూట్ కట్ బాలరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి అదేప్పుడంటే..?

Bootcut Balaraju OTT: బిగ్‌ బాస్‌ ఫేమ్ సోహెల్ ఇటీవలే బూట్ కట్ బాలరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి అదేప్పుడంటే..?

  • Published Feb 20, 2024 | 12:52 PMUpdated Mar 14, 2024 | 5:00 PM
OTTలోకి బిగ్‌బాస్ సోహెల్ బూట్‌క‌ట్ బాల‌రాజు – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

బిగ్‌ బాస్‌ ఫేమ్ ‘సోహెల్’ గురించి అందరికి తెలిసిందే. ఈ షో ద్వారా సోహెల్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆయనకు వరుస సినిమా ఆవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. సోహెల్ హీరోగా ఒకటి రెండు సినిమాల్లో అలరించాడు. కాగా, ఆ సినిమాలన్నీ మిశ్రమ టాక్ ను సంపాదించుకున్నాయి. అయితే.. తాజాగా సోహెల్ ‘బూట్ కట్ బాలరాజు’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో హీరోయిన్ గా మేఘ‌మాల‌ నటించింది. అలాగే ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీ కోనేటి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఈ నెల 2న థియేటర్ ల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక సోహెల్ మూవీ కోసం భారీగానే ప్రమోషన్లు చేసినా.. సినిమా మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బూట్ కట్ బాలరాజు సినిమా థియేటర్ లో విడుదలై నెలరోజులు గడవక ముందే ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. ఇంతకి అదేప్పుడంటే?

బిగ్‌బాస్ సోహెల్ తాజాగా నటించిన చిత్రం ‘బూట్ కట్ బాలరాజు’. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. పైగా సినిమా విడుదలైన సమయంలో థియేటర్స్ కు జనాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే.. సోహెల్ ఇటీవలే తీవ్ర భావోద్వేగానికి గురైయన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు సోహెల్ సినిమా విడుదలై నెలరోజులు గడవక ముందే ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. ఇంతకి అదేప్పుడంటే.. సోహెల్ బూట్ కట్ బాలరాజు మూవీ ఓటీటీ రైట్స్‌ను.. అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం అందింది. అంతేకాకుండా.. ఈ సినిమా ఈ నెల అనగా ఫిబ్రవరి 26వ తేదిన సాయంత్రం 6 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాలో సునీల్‌, ఇంద్ర‌జ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Bigg Boss Sohel bootcut Balaraj into OTT

ఇక బూట్ కట్ బాలరాజు కథ విషయానికొస్తే.. హీరో బాలరాజు (సోహెల్) తన గ్రామంలో ఉన్న ఊరి పెద్ద (ఇంద్ర‌జ ) కూతురు మ‌హాల‌క్ష్మిని (మేఘమాల‌) ప్రేమిస్తాడు. కానీ, వారి ప్రేమ‌కు హీరోయిన్ తల్లి గ్రామ పెద్ద ఒప్పుకోదు. దీంతో స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో త‌న‌పై పోటీ చేసి గెలిస్తేనే తన కూతురు మ‌హాల‌క్ష్మిని నీకు ఇచ్చి పెళ్లిచేస్తాన‌ని బాల‌రాజుతో ఛాలెంజ్ చేస్తుంది. ఆమె ఛాలెంజ్‌ను బాల‌రాజు అంగీక‌రించాడా? స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో గెలిచి మ‌హాల‌క్ష్మి ప్రేమ‌ను సొంతం చేసుకున్నాడా? లేదా? అన్న‌దే బూట్ క‌ట్ బాల‌రాజు మూవీ క‌థ‌. మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే త్వరలో ఓటీటీకి రాబోతున్న బూట్ కట్ బాలరాజు చూడాల్సిందే. మరి,  మరో మూడు రోజుల్లో బూట్ కట్ బాలరాజు మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం పైమీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet