iDreamPost
android-app
ios-app

Sobhita Dhulipala: సూపర్ హిట్ సీక్వెల్.. స్పెషల్ సాంగ్ లో శోభితా ధూళిపాళ్ల?

  • Published Aug 22, 2024 | 4:48 PM Updated Updated Aug 22, 2024 | 4:48 PM

శోభితా ధూళిపాళ్ల ఓ సూపర్ హిట్ సీక్వెల్ సినిమాలో ప్రత్యేక గీతంలో నటిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

శోభితా ధూళిపాళ్ల ఓ సూపర్ హిట్ సీక్వెల్ సినిమాలో ప్రత్యేక గీతంలో నటిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 22, 2024 | 4:48 PMUpdated Aug 22, 2024 | 4:48 PM
Sobhita Dhulipala: సూపర్ హిట్ సీక్వెల్.. స్పెషల్ సాంగ్ లో శోభితా ధూళిపాళ్ల?

స్టార్ హీరోయిన్స్ ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే మరో వైపు స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో వస్తోంది. ఇప్పటికే సమంత, కాజల్, పూజా హెగ్డే ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్స్ ప్రత్యేక గీతాల్లో మెరిశారు. ఇక ఇప్పుడు ఆ జాబితాలోకి మరో హీరోయిన్ చేరబోతున్నట్లు తెలుస్తోంది. అవును శోభితా ధూళిపాళ్ల ఓ సూపర్ హిట్ సీక్వెల్ సినిమాలో ప్రత్యేక గీతంలో నటిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘డాన్’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇక దానికి సీక్వెల్ గా వచ్చిన డాన్ 2 కూడా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు త్వరలోనే ‘డాన్ 3’ తెరకెక్కబోతోంది. రణ్ వీర్ సింగ్ హీరోగా, పర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. వచ్చే సంవత్సరం నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది. కాగా.. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కోసం శోభితా ధూళిపాళ్లను మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ పర్హాన్ అక్తర్ ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు బీటౌన్ నుంచి అందుతున్న సమాచారం.

ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే ఇప్పటి వరకు శోభితాగానీ, ఆమె టీమ్ గానీ ఈ విషయంపై స్పందించలేదు. కాగా.. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా గెలిచిన తర్వాత.. 2016 ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శోభితా. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లోనూ వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ఇక ఇటీవలే నాగచైతన్యతో శోభితా ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగనుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş