iDreamPost
android-app
ios-app

SK23: శివకార్తికేయన్ సినిమాలో భారీ స్టార్ కాస్ట్

  • Published Apr 01, 2024 | 3:30 PM Updated Updated Apr 01, 2024 | 3:30 PM

SK23, శివకార్తికేయన్ - దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్‌ల కాంబినేషన్లో రానున్న భారీ ప్రాజెక్ట్.ఈ విషయం పై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇది దాదాపు కన్ఫర్మ్ న్యూస్ అని అంటున్నారు.

SK23, శివకార్తికేయన్ - దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్‌ల కాంబినేషన్లో రానున్న భారీ ప్రాజెక్ట్.ఈ విషయం పై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇది దాదాపు కన్ఫర్మ్ న్యూస్ అని అంటున్నారు.

  • Published Apr 01, 2024 | 3:30 PMUpdated Apr 01, 2024 | 3:30 PM
SK23: శివకార్తికేయన్ సినిమాలో భారీ స్టార్ కాస్ట్

SK23, శివకార్తికేయన్ – దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్‌ల కాంబినేషన్లో రానున్న భారీ ప్రాజెక్ట్. తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. తాజా వార్తల ప్రకారం, ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్‌ విలన్ పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. ఈ విషయం పై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇది దాదాపు కన్ఫర్మ్ న్యూస్ అని అంటున్నారు. దళపతి విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తుపాకీ (2012) బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కూడా విద్యుత్ జమ్వాల్ విలన్ గా నటించారు. ఇప్పుడు మరోసారి మురుగదాస్ విద్యుత్ తో చేతులు కలుపుతారని వినడానికి అభిమానులు సంతోషిస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే SK23 ద్వారా 10 సంవత్సరాల విరామం తర్వాత విద్యుత్ జమ్వాల్ తమిళ సినిమాకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చే చిత్రం అవుతుంది. విద్యుత్ చివరగా సూర్య నటించిన అంజాన్‌ సినిమాలో కనిపించారు. కేవలం విద్యుత్ జమ్వాల్ మాత్రమే కాదు, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా శివకార్తికేయన్ 23వ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. నిర్మాతల నుంచి ఈ విషయం పై అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ చిత్రంలో లూసిఫర్ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు బజ్ అయితే గట్టిగానే ఉంది. మొత్తం మీద, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అద్భుతమైన స్టార్ కాస్ట్ కనిపిస్తుందని తెలిసిన తరువాత అభిమానుల అంచనాలు ఇంకా పెరిగాయి.

SK23 2024 దీపావళి సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా తమిళ సినిమాలకు దీపావళి సీజన్ చాలా మంచి రిలీజ్ డేట్ గా భావిస్తుంటారు. ఇక శివకార్తికేయన్ ఈ చిత్రంతో పాటు అమరన్‌ అనే మరో సినిమాలో పని చేస్తున్నారు. కానీ రెండిటిలో SK23నే మొదట విడుదల కావచ్చు అంటున్నారు. కాగా ఇటీవలే దర్శకుడు మురుగదాస్, సల్మాన్ ఖాన్‌తో ఒక బిగ్ బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. అందువల్ల, మురుగదాస్ SK23 సినిమాకి సంభందించిన షూట్‌ను త్వరగా ముగించే అవకాశం ఉంది, తద్వారా ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ పై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. SK23లో కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా… అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio