iDreamPost
android-app
ios-app

అభిమానుల ముందు కంటతడి పెట్టుకున్న శివకార్తికేయన్..!

  • Published Mar 12, 2024 | 5:13 PM Updated Updated Mar 12, 2024 | 5:13 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో శివకార్తీకేయన్ ఒకరు. ఈ ఏడాది అయలాన్ చిత్రంతో మెరిసిన అతడు.. ఇప్పుడు అమరన్ మూవీ చేస్తున్నాడు. ఈ క్రమంలో

కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో శివకార్తీకేయన్ ఒకరు. ఈ ఏడాది అయలాన్ చిత్రంతో మెరిసిన అతడు.. ఇప్పుడు అమరన్ మూవీ చేస్తున్నాడు. ఈ క్రమంలో

  • Published Mar 12, 2024 | 5:13 PMUpdated Mar 12, 2024 | 5:13 PM
అభిమానుల ముందు కంటతడి పెట్టుకున్న శివకార్తికేయన్..!

మల్టీ టాలెంటర్, వర్సటైల్ యాక్టర్, రజనీకాంత్ వీరాభిమాని శివకార్తికేయన్ గురించి తమిళనాటే కాదూ.. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేయనక్కర్లేని పేరు. తమిళనాడులో బిగ్ హీరోల్లో అతడు కూడా ఒకడు. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అతడో మిమిక్రీ ఆర్టిస్ట్.. స్టాండప్ కమెడియన్. కాలేజీ రోజుల నుండి స్టేజ్ షోస్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత టీవీ రంగం నుండి ఆ తర్వాత బిగ్ స్క్రీన్ పై మెరిసి..స్టార్ హోదా తెచ్చుకున్నాడు. ఇప్పుడు కోట్లు రెమ్యునరేషన్ కొల్లగొడుతున్నాడు. అతడు నటుడే కాదూ.. సింగర్, లిరిసిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్, నిర్మాత అన్ని కోణాలున్నాయి అతడిలో. మెరీనా అనే చిత్రంతో ప్రూవ్ చేసుకున్న అతడు.. త్రి చిత్రంలో ధనుష్ స్నేహితుడి పాత్రలో మెరిశాడు. ఈ ఏడాది అయలాన్ మూవీతో మెప్పించిన ఇతడు.. అమరన్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

ఈ క్రమంలో తాజాగా ఫ్యాన్స్ మీట్ నిర్వహించాడు శివకార్తీకేయన్. తన ఫ్యాన్స్ కలుసుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనను పలు ప్రశ్నలు సంధించారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా ఓ అభిమాని మాట్లాడుతూ.. ఇళయదళపతి విజయ్ వారసుడు మీరే అన్న ప్రశ్న రాగా.. దాన్ని ఇగ్నోర్ చేశారు. తాను తదుపరి విజయ్ కావాలనుకోవడం లేదని, తాను శివకార్తికేయనే అంటూ సమాధానం ఇచ్చారు. అంతలోనే ఎమోషనల్ అయ్యారు. ‘ ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటాలనుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. ఈ పొజిషన్ రావడానికి వారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఎవ్వరికీ తెలియదు. అవేమీ తెలియకుండా.. వారితో పోల్చుకోవడం సరైనది కాదూ.

నటుడిగా ఎదగాలనుకున్న సమయంలో నేను సమస్యలు ఎదుర్కొన్నారు. నా సినీ కెరీర్‌లో చాలా సమస్యలు, బాధలు ఉన్నాయి. దానిని పంచుకోవడానికి నాకు ఫాదర్, బ్రదర్స్ లేరు. కానీ అలాంటి సమయాల్లో మీరు, అభిమానులు అండగా నిలిచారు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు శివకార్తికేయన్. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో కూడా నేరుగా చిత్రాలు చేశాడు శివ. కౌశల్య కృష్ణ మూర్తి, ప్రిన్స్ వంటి చిత్రాల్లో నటించాడు. అమరన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో మేజర్ ముకుంద్ వరదరాజన్ అనే పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. కాశ్మీర్ తొలి దశ షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి హీరోయిన్. అలాగే ఎస్కే 23 కూడా షురూ చేశాడు.. దీన్ని ఏఆర్ మురుగుదాస్ తెరకెక్కించబోతున్నాడు. దీపావళికి ఈ చిత్రం రాబోతుంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş