iDreamPost
android-app
ios-app

OTTలోకి శివకార్తికేయన్ అయలాన్.. తెలుగులో థియేటర్ రిలీజ్ లేకుండానే!

  • Published Jan 28, 2024 | 12:03 PM Updated Updated Mar 14, 2024 | 5:05 PM

హీరో శివ కార్తికేయన్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా అయలాన్‌. ఏలియన్‌ బ్యాక్ డ్రాప్‌లో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్ లో విడుదల కాకముందే నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి అది ఎప్పుడంటే..

హీరో శివ కార్తికేయన్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా అయలాన్‌. ఏలియన్‌ బ్యాక్ డ్రాప్‌లో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్ లో విడుదల కాకముందే నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి అది ఎప్పుడంటే..

  • Published Jan 28, 2024 | 12:03 PMUpdated Mar 14, 2024 | 5:05 PM
OTTలోకి శివకార్తికేయన్ అయలాన్.. తెలుగులో థియేటర్ రిలీజ్ లేకుండానే!

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’.ఏలియన్‌ బ్యాక్ డ్రాప్‌లో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రన్ని దర్శకుడు ఆర్. రవికుమార్ తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. కాగా, పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించిన అయలాన్ ఒక్క తమిళ్ వెర్షన్ లో మాత్రమే విడుదలైంది. ఎందుకంటే.. ఆ సమయంలో టాలీవుడ్ లోని సంక్రాతి బరిలో చాలామంది స్టార్ హీరోలా సినిమాలు ఉండటంతో తెలుగు వెర్షన్ వాయిదా వేశారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెలుగు వెర్షన్‌ను రిలీజ్‌ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, అది కూడా జరగకపోవడంతో.. మరోసారి తెలుగు వెర్షన్ లో అయలాన్ మూవీ వాయిదా పడింది. ఇక ఇప్పటికి ఈ సినిమాపై తెలుగు వెర్షన్ విడుదలపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇంతలోనే ఈ మూవీ పై ఓటీటీ ప్రకటన వచ్చేసింది. అది ఎప్పుడంటే..

శివకార్తికేయన్ నటించిన అయలాన్ మూవీ తెలుగు రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా తెలుగు వర్షన్‌ ఇప్పుడు రిలీజ్‌ కావడం కష్టమని అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కు సిద్ధంగా ఉందని ప్రకటన వచ్చేసింది. అయలాన్ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సన్‌ నెక్ట్స్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అలాగే త్వరలోనే శివ కార్తికేయన్‌ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అయితే నెక్ట్స్‌ అప్‌ డేట్ కోసం వేచి చూస్తు ఉండమని శనివారం అధికారికంగా ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ ను షేర్‌ చేసింది. కాగా, ఓటీటీ రిలీజ్‌ డేట్‌ గురించి క్లారిటీ ఇవ్వలేదు.కానీ, ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. అయితే అంతకు ముందు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

aylaan movie in ott

ఒక వేళ అయలాన్ సినిమా వచ్చేవారం అంటే ఫిబ్రవరి 2వ తేదీన తెలుగులో రిలీజ్ చేసిన సరే వారం పదిరోజుల్లో ఓటీటీలోకి వచ్చేయవచ్చు. కానీ ఇప్పుడు ఆ సూచనలే కనిపించడం లేనదని సినీ విశ్లేషకుల నుంచి సమాచారం. ఇక అయలాన్ మూవీ తమిళనాట మంచి కలెక్షన్లు రాబెట్టింది. ఈ సినిమా యూనివర్సల్ కాన్సెప్ట్ తో రూపొందించినది. అలాగే కోలీవుడ్ లోసూపర్ డూపర్ హిట్ కావడంతో.. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం అభిప్రాయం. ఇక ఏదేమైనా ఆయలాన్‌ సినిమా థియేటర్‌లోకి వస్తుందా? లేదా డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందా? అనే సస్పెన్స్‌ వీడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. మరి, త్వరలో శివకార్తికేయన్ అయలాన్ మూవీ ఓటీటీ రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet