iDreamPost
android-app
ios-app

Sitara Ghattamaneni సితార ప్రమోషన్ వెనుక కారణమిదేనా?

  • Published Apr 12, 2022 | 4:21 PM Updated Updated Apr 12, 2022 | 4:21 PM
Sitara Ghattamaneni సితార ప్రమోషన్ వెనుక కారణమిదేనా?

ఇటీవలి కాలంలో ఏ స్టార్ హీరో కూతురికి దక్కనంత పబ్లిసిటీ మహేష్ బాబు వారసురాలు సితార అందుకుంటున్న మాట వాస్తవం. దీని వెనుక తల్లితండ్రుల ప్రోత్సాహం ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. పాప కూచిపూడి డాన్స్ చేసినా, స్విమ్మింగ్ చేస్తూ శ్వాసను బిగబట్టుకోవడం ఎలాగో చూపించినా, సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ పెన్నీ సాంగ్ కు స్టెప్పులు వేసినా ప్రతిదీ సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని పత్రికలు ఒక అడుగు ముందుకేసి తనతో స్పెషల్ ఇంటర్వ్యూలు చేసి దాన్ని బాగా హై లైట్ చేస్తు మరీ ప్రచురించాయి. వాస్తవానికి మహేష్ అబ్బాయి గౌతమ్ కు ఇందులో పది శాతం ప్రమోషన్ కూడా లేదు.

ఇలా ఎందుకు చేస్తున్నారన్న సందేశం రావడం సహజం. సితారను ఒకవేళ సినిమాల్లో పరిచయం చేసే ఉద్దేశం ఉంటే ఇదంతా ముందస్తు ప్రిపరేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో సూపర్ స్టార్ కృష్ణ అమ్మాయి మంజుల తెరపై డెబ్యూ చేయాలనుకున్నప్పుడు అభిమానుల నుంచి వద్దనే ఒత్తిడి వచ్చింది. దానికి ఆయన తలొగ్గక తప్పలేదు. చివరికి షో, కావ్యాస్ డైరీ లాంటి ఆఫ్ బీట్ చిత్రాలతో మంజుల తన ప్యాషన్ ని కొంత వరకు తీర్చుకుంది కానీ పూర్తిగా అయితే కాదు. అలాంటి సమస్య సితారకు రాకుండా ఫ్యాన్స్ ని ముందు నుంచి సంసిద్ధత చేయిస్తున్నారేమో కానీ మొత్తానికి క్రమం తప్పకుండ సితార అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి.

స్టార్ల కూతుళ్లు తెరమీద లేదా బయట కనిపించడం తక్కువ. బాలయ్య ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించారు తప్ప సినిమాల ఆప్షన్ ఇవ్వలేదు. రజనీకాంత్ ఇద్దరు కూతుళ్లు ఆలస్యంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నటనపరంగా కాకపోయినా సరే. చిరంజీవి పెద్దమ్మాయి కాస్ట్యూమ్స్ విభాగం చూసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ సితార విషయంలో జరుగుతున్నది వేరు. ఇదేమి తప్పు కాదు. మారుతున్న ప్రపంచంలో తమ ఉనికిని చాటుకోవడానికి సెలబ్రిటీ పిల్లలు ప్రయత్నాలు చేయడం మాములే. సితార మరీ చిన్న వయసు కావడంతో ఇంత ప్రచారం ఎందుకనే కామెంట్స్ లేకపోలేదు.కానీ ఎవరి లైఫ్ వారిదే అంటే కాదనగలమా

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet