iDreamPost
android-app
ios-app

అది నా DNAలోనే ఉంది.. కృష్ణ, మహేష్ బాబుపై సితార ఎమోషనల్ పోస్ట్!

  • Author Soma Sekhar Updated - 11:58 AM, Fri - 3 November 23
  • Author Soma Sekhar Updated - 11:58 AM, Fri - 3 November 23
అది నా DNAలోనే ఉంది.. కృష్ణ, మహేష్ బాబుపై సితార ఎమోషనల్ పోస్ట్!

సితార.. మహేష్ బాబు కూతురిగానే కాకుండా పలు యాడ్స్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. తండ్రికి తగ్గ తనయగా సింగిల్ గా కమర్షియల్ యాడ్స్ చేస్తూ.. తన రేంజ్ ను పెంచుకునే పనిలో పడింది సితార. ఇక ఈ యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులను సేవా కార్యక్రమాలకు డొనేట్ చేసి.. తన హెల్పింగ్ నేచర్ ను చాటుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది సితార. తన తండ్రి, తాతాయ్యను తలచుకుని నేషనల్ సినిమా డే సందర్భంగా ఈ పోస్ట్ ను షేర్ చేసింది. ప్రస్తుతం సితార చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

సితార.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన డ్యాన్స్ లతో మెస్మరైజ్ చేస్తుంది. ఇక పలు యాడ్ షూట్స్ లో మెరిసి తండ్రికి తగ్గ కూతురిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే జాతీయ సినిమా దినోత్సవం(అక్టోబర్ 13) సందర్భంగా తన ఫ్యామిలీ సినీ జీవితానికి సంబంధించి ఓ పోస్ట్ చేసింది. అందులో ఈ విధంగా రాసుకొచ్చింది సితార.”సినిమా అనేది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు. అది నా DNAలోనే ఉంది. మూవీస్ నా లైఫ్ లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. వెండితెరపై మా నాన్న ఒక సూపర్ స్టార్. ఆయన నాకు ఎంతో స్ఫూర్తి. అలాగే నా తండ్రికి తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ కూడా అంతే స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆయన సినీ జీవిత ప్రయాణం మా జీవితాలను ఎంతో ప్రభావితం చేసింది. ఇలాంటి వారసత్వంలో నేను భాగం అయినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను” అంటూ పేర్కొంది. కాగా.. ఈ ప్రయాణంలో ఇన్నాళ్లుగా తమకు సపోర్ట్ గా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది సితార. మరి సితార ఎమోషనల్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by sitara 🪩 (@sitaraghattamaneni)

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş