iDreamPost
android-app
ios-app

మంచి మనసు చాటుకున్న సితార.. తొలి రెమ్యూనరేషన్ తో..!

మంచి మనసు చాటుకున్న సితార.. తొలి రెమ్యూనరేషన్ తో..!

మహేష్ బాబు చాలా కాలం నుంచి ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చాడు. ఎంతో మంది గుండె సమస్యలు ఉన్న పిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించి వాళ్లని కాపాడాడు. ఆంధ్రప్రదేశ్ లో బుర్రిపాలెం, సిద్ధపురం అనే రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మహేష్ బాబు నెలవారీ సంపాదనలో 30 శాతం పేద పిల్లలకి, ముసలి వాళ్ళకి డొనేట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆయన కుమార్తె సితార కూడా మహేష్ బాటలోనే నడుస్తోంది.

మహేష్ బాబు వెండితెర మీద మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్. ఆ విషయాన్ని తెలియజెప్పే సంఘటనలు చాలానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న కష్టం వచ్చిన సహాయం అందించడంలో మహేష్ ముందుంటారు. వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్నోసార్లు ఆపన్న హస్తం అందించాడు. అప్పట్లో హుద్ హుద్ తుపాను సమయంలో ప్రభుత్వానికి మహేష్ బాబు 16 కోట్లు విరాళంగా ఇచ్చారు. మహేష్ బాబు- నమ్రత దంపతులు కలిసి మహేష్ బాబు ఫౌండేషన్ ను స్థాపించిన విషయం తెలిసిందే. ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు ఎవరైనా తమ వివరాలు తెలిపితే వారికి సహాయం చేస్తుంటారు. అలా ఇప్పుటివరకు ఎంతో మంది ప్రజల  ప్రాణాలు కాపాడారు.

ఇప్పుడు మహేష్ కూతురు సితార కూడా అతనిబాటలోనే నడుస్తోంది. సితార పీఎంజే అనే ఒక జ్యూవెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కొద్దీ రోజుల ముందు ఓ ఫోటోషూట్ కూడా చేసింది. ఆ జ్యూవెలరీ బ్రాండ్ కి ఒక యాడ్ కూడా చేసింది. ఈ బ్రాండ్ కొత్తగా సితార అనే పేరుతో స్పెషల్ కలెక్షన్ తయారు చేశారు. ఆ ఫోటోషూట్ కి సంబందించిన ఫొటోస్, యాడ్ న్యూయార్క్ సిటీ లోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించారు. అచ్చం బుట్టబొమ్మలాగా ఉందని అభిమానులు ప్రశంశలు కురిపించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోషూట్ కి సంబంధించి సితార కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.

తాజాగా జ్యూవెలరీకి సంబంధించి లాఛింగ్ ప్రోగ్రామ్ లో నమ్రత, సితార పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతుండగా.. ‘మీ తొలి రెమ్యూనరేషన్ ఎవరికి ఇచ్చారు? అమ్మకా? నాన్నకా?’ అంటూ ప్రశ్నించారు. అందుకు సితార ఆ డబ్బుని “చారిటీకి ఇచ్చాను” అని సమాధానం చెప్పింది. ఆ విషయం తెలియగానే అంతా సితార మీద ప్రశంసల వర్షం కురిపించడం ప్రారంభించారు. ఒక్క మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాకుండా.. తెలుగు ప్రజలంతా సితార మంచి మనసును మెచ్చుకుంటున్నారు. ఇంత చిన్న వయసులోనే ఎంతో గొప్ప పని చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సితార చేసిన సహాయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండ్రి కి తగ్గ కూతురు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సితార చేసిన ఈ మంచి పనిపై మీ అభిప్రాయలను కామెట్స్ రూపంలో తెలియచేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom