iDreamPost
android-app
ios-app

డైరెక్ట్‌గా ఓటీటీలో కీర్తి సురేష్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jan 13, 2024 | 3:44 PM Updated Updated Jan 13, 2024 | 3:44 PM

Siren Movie Release OTT: ఇటీవల ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ వారం వారం సందడి చేస్తున్నాయి. దీనికి తోడు కొంతమంది దర్శక, నిర్మాతలు తమ సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు.

Siren Movie Release OTT: ఇటీవల ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ వారం వారం సందడి చేస్తున్నాయి. దీనికి తోడు కొంతమంది దర్శక, నిర్మాతలు తమ సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు.

  • Published Jan 13, 2024 | 3:44 PMUpdated Jan 13, 2024 | 3:44 PM
డైరెక్ట్‌గా ఓటీటీలో కీర్తి సురేష్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఒకప్పుడు సినీ ప్రేమికులు తమ అభిమాన నటుల సినిమాలు రిలీజ్ అయితే.. ధియేటర్ల వద్ద క్యూ లైన్లో నిలబడి టికెట్ తీసుకొని సినిమాలు చూసేవారు. తర్వాత ఆన్ లైన్ బుకింగ్ చేసుకొని చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. హాయిగా ఇంట్లో కూర్చొని ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా ధియేటర్లు మూసి వేసిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో చాలా మంది ఓటీటీలో సినిమాలు, వెబ్ సీరీస్ చూడటం అలవాటు చేసుకొని ఇప్పుడు దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటీటీలో భారతీయ చిత్రాలు మాత్రమే కాదు.. ఇతర భాషా చిత్రాలు కూడా చూసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు కొంతమంది దర్శక, నిర్మాతలు డైరెక్ట్ గా తమ సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జయం రవి, కీర్తి సురేష్ నటించిన యాక్షన్, థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ హీరో జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా సైరెన్. ఈ సినిమాలో జయం రవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. హూమ్ ఫిలిమ్ మేకర్స్ పతాకంపై సుజాత నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఇటీవల రిలీజ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో జయం రవి జైలర్ గా నటిస్తున్నారు.. కీర్తి సురేష్ పోలీస్ అధికారిగా నటిస్తుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు యాక్షన్ తరహా చిత్రం కావడంతో అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి.

ఈ సినిమా ధియేటర్లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే హీరో జయంరవి అభిమానులకు షాక్ ఇచ్చే ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. సైరెన్ మూవీ ధియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ నెల 26న నేరుగా జీ 5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. జయంరవి నటించిన భూమి మూవీ కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. సైరెన్ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందన్న విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో యోగిబాబు, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş