iDreamPost
android-app
ios-app

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సింగం డైరెక్టర్ తండ్రి కన్నుమూత

  • Published Oct 22, 2023 | 12:09 PM Updated Updated Oct 22, 2023 | 12:09 PM

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాం నెలకొంది. ఓ స్టార్ డైరెక్టర్ తండ్రి కన్నుమూశారు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాం నెలకొంది. ఓ స్టార్ డైరెక్టర్ తండ్రి కన్నుమూశారు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

  • Published Oct 22, 2023 | 12:09 PMUpdated Oct 22, 2023 | 12:09 PM
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సింగం డైరెక్టర్ తండ్రి కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ తండ్రి కన్నుమూశారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి మరణించింన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సింగం సినిమా డైరెక్టర్ హరి తండ్రి తుది శ్వాస విడిచారు. కొంత కాలం నుంచి హరి తండ్రి వీఏ గోపాలకృష్ణన్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. డైరెక్టర్ హరి తండ్రి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు హరికి, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నారు.

ఇక గోపాలకృష్ణన్ అంత్యక్రియలు ఈరోజు టుటికోరిన్ జిల్లాలోని హరి స్వస్థలమైన కాచనవిలైలో జరగనున్నట్లు హరి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అంత‌కుముందు ఆయన భౌతికకాయాన్ని శ‌నివారం మధ్యాహ్నం 2 గంటల వరకు చెన్నైలోని సాలిగ్రామంలోని హరి నివాసంలో సినీ ప్రముఖుల నివాళులర్పించేందుకు ఉంచారు. కాగా 2010 లో హరి దర్శకత్వంలో తెరకెక్కిన సింగం సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టార్ హీరో సూర్య, అనుష్క జంటగా తెరకెక్కిన సింగం సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.డైరెక్టర్ హరి ప్రస్తుతం విశాల్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet