iDreamPost
android-app
ios-app

స్టార్‌ రచయితపై మరో కంప్లైంట్‌.. ఈసారి సింగర్‌ వినైత!

  • Published Jul 14, 2023 | 11:48 AM Updated Updated Jul 14, 2023 | 11:48 AM
  • Published Jul 14, 2023 | 11:48 AMUpdated Jul 14, 2023 | 11:48 AM
స్టార్‌ రచయితపై మరో కంప్లైంట్‌.. ఈసారి సింగర్‌ వినైత!

లైంగిక వేధింపుల వివాదాల్లో తమిళ స్టార్‌ రచయిత వైరముత్తు పేరు తరచుగా వినబడుతోంది. ప్రముఖ లేడీ సింగర్లు వరుస పెట్టి ఆయనపై కంప్లైంట్లు చేస్తున్నారు. సింగర్‌ చిన్మయి శ్రీపాద గతంలో చాలా సార్లు వైరముత్తపై విమర్శలు చేశారు. ఆయన తనను లైంగికంగా వేధించారంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆయనపై విరుచుకుపడ్డారు. వీలు చిక్కినప్పుడల్లా ఆయనపై మండిపాటు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక, వైరముత్తు తనపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మరో సింగర్‌ బాంబు పేల్చింది.

ప్రముఖ బహుభాషా సింగర్‌ వినైత వైరముత్తపై షాకింగ్‌ కామెంట్లు చేశారు. ఈ మేరకు ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘ చిన్మయి వైరముత్తు గురించి మాట్లాడింది. నేను ఆమెను సపోర్ట్‌ చేస్తాను. వైరముత్తుతో నాకు కూడా అచ్చం అలాంటి అనుభవాలే ఉన్నాయి. నాకు తెలుసు ఆయన మంచి వ్యక్తి కాదని. ‘నా ప్లేస్‌ ఒకటి ఉంది. అక్కడికి రా. మాట్లాడదాం. నువ్వు మంచిగా పాటలు పాడుకోవచ్చు’ అన్నాడు. ఆయన ముఖం చూసి మాట్లాడరు. మొత్తం బాడీ చూసి మాట్లాడుతూ ఉంటారు. చాలా చీప్‌గా ప్రవర్తిస్తారు. ఆయన చాలా మందితో ఇలా ప్రవర్తించాడని నాకు తెలుసు.

నేను ఎప్పడూ ఆయన్ని గాంధీ తాత లాగా చూడలేదు. అతని బండారం బయటపడింది’’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సింగర్‌ చిన్మయి తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వైరముత్తు పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. వైరముత్తకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సింగర్‌ చిన్మయి తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. కామాంధుడికి సత్కారాలా అంటూ ఆ‍గ్రహం వ్యక్తం చేశారు. మరి, వైరముత్తుపై సింగర్ల ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbettilt girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş