Dharani
Singer Suseelamma: భాషతో సంబంధం లేకుండా.. వేల పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన సుశీలమ్మ తాజా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన వారు.. సుశీలమ్మ ఇలా మారిపోయారేంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
Singer Suseelamma: భాషతో సంబంధం లేకుండా.. వేల పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన సుశీలమ్మ తాజా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన వారు.. సుశీలమ్మ ఇలా మారిపోయారేంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
Dharani
ఈతరం వారికి మరీ ముఖ్యంగా 20కే జనరేషన్‌కి సింగర్ సుశీలమ్మ గురించి పెద్దగా తెలిసే అవకాశం లేదు. కానీ కొన్ని దశాబ్దాల పాటు ఆమె తన గానామృతంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. తెలుగు, తమిళం, అనే తేడా లేకుండా అనేక భాషల్లో వేల పాటలు పాడి.. ప్రేక్షకులను అలరించారు. సినిమా పాటలు మాత్రమే కాక.. భక్తి గీతాలు, భజనలు కూడా ఆలపించారు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, సంస్కృతం, తుళు.. ఇలా పలు భాషలలో పాటలు పాడి గాన కోకిలగా గుర్తింపు పొందారు. ‘కన్నతల్లి’ అనే సినిమాలో పాడిన పాటతో నేపథ్య గాయనిగా పరిచయం అయిన సుశీల కొన్ని దశాబ్దాలుగా తన గాన మాధుర్యంతో అందరినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇక వయసు పైబటడంతో గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు సుశీల. ఆమె ఎక్కువగా బయట కనిపించరు. సినిమా ఈవెంట్లకు కూడా పెద్దగా హాజరు కారు. ఈ క్రమంలో తాజాగా సుశీలమ్మ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వచ్చారు. అక్కడ ఆమెను చూసిన భక్తులు ముందు గుర్తు పట్టలేకపోయారు. వయసు మీద పడటం, వృద్ధాప్యం వల్ల సుశీలమ్మ తన సొంతంగా నడవలేకపోతున్నారు. ఎవరైనా పట్టుకుని నడిపించాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇక తిరుపతి వచ్చిన సుశీలమ్మ.. శ్రీవారిని దర్శించుకుని.. మొక్కు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించున్న సుశీలమ్మ.. తలనీలాలు సమర్పించుకున్నారు. దాంతో చాలా మంది ఆమెను గుర్తించలేకపోయారు. ఈ సందర్భంగా సుశీలమ్మ మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఇన్నాళ్లకు నెరవేర్చుకోగలిగాను. ఎన్నాళ్ళుగానో స్వామి వారికి తల నీలాలు సమర్పించుకునే మొక్కు ఉంది. ఆ మొక్కును ఇన్నాళ్లకు తీర్చుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు సుశీలమ్మ.
తలనీలాల మొక్కు తీర్చుకున్న అనంతరం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెను చూసిన భక్తులు.. సుశీలమ్మతో ఫొటోలు దిగడానికి అక్కడున్న భక్తులు పోటీ పడ్డారు. సుశీలమ్మ విషయానికి వస్తే.. తెలుగు సినీ రంగంలో 50వేలకు పైగా పాటలు పాడి గాన కోకిలగా గుర్తింపు తెచ్చుకున్నారు.