iDreamPost
android-app
ios-app

రెండోసారి తల్లికాబోతున్న సింగర్ గీతా మాధురి.. ఘనంగా సీమంతం వేడుకలు!

  • Published Feb 01, 2024 | 8:42 PM Updated Updated Feb 01, 2024 | 8:42 PM

Geetha Madhuri baby shower celebrations: టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి రెండోసారి తల్లికాబోతోంది. అంగరంగ వైభవంగా ఆమె సీమంతం వేడుకలు జరిగాయి.

Geetha Madhuri baby shower celebrations: టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి రెండోసారి తల్లికాబోతోంది. అంగరంగ వైభవంగా ఆమె సీమంతం వేడుకలు జరిగాయి.

  • Published Feb 01, 2024 | 8:42 PMUpdated Feb 01, 2024 | 8:42 PM
రెండోసారి తల్లికాబోతున్న సింగర్ గీతా మాధురి.. ఘనంగా సీమంతం వేడుకలు!

గీతా మాధురి.. టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా కొనసాగుతోంది. తన గొంతుతో రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రత్యేకించి ఐటెం సాంగ్ లు పాడటంలో గీతా మాధురిది స్పెషల్ టాలెంట్ అనే చెప్పాలి. అందుకే చాలా వరకు ఐటెం సాంగ్ లను ఆమె చేతనే పాడించేందుకు ఇష్టపడుతుంటారు దర్శక నిర్మాతలు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా గీతా మాధురి సీమంతం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నందు-గీతా మాధురి ఈ జంటకు టాలీవుడ్ లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తన పాటలతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది ఈ స్టార్ సింగర్. ఇక నందు ఇటు తన నటనతో పాటుగా యాంకరింగ్ తో అలరిస్తున్నాడు. ఇక ఈ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. గీతా మాధురి ప్రెగ్నెంట్ అన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఆమె సీమంతం వేడుకను కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. నందు-గీతా దంపతులకు ఇదివరకే దాక్షాయని అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో మరో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది ఈ స్టార్ సింగర్. దీంతో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటుగా అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş