iDreamPost
android-app
ios-app

జానీ మాస్టర్ వివాదంపై స్పందించిన సింగర్ చిన్మయి శ్రీపాద

  • Published Sep 17, 2024 | 1:55 PM Updated Updated Sep 17, 2024 | 1:55 PM

Singer Chinmayi Responded Over choreographer jani master Issue: ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై.. వివాదం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కేసును విచారిస్తున్న కొద్దీ దానికి సంబంధించిన ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Singer Chinmayi Responded Over choreographer jani master Issue: ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై.. వివాదం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కేసును విచారిస్తున్న కొద్దీ దానికి సంబంధించిన ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 17, 2024 | 1:55 PMUpdated Sep 17, 2024 | 1:55 PM
జానీ మాస్టర్ వివాదంపై స్పందించిన సింగర్ చిన్మయి శ్రీపాద

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని.. అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్న యువతి కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మీడియా , సోషల్ మీడియాలో ఈ విషయం అందరిని ఆలోచింపచేసేలా చేస్తుంది. దీనితో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఈ కేసును విచారిస్తున్న కొద్దీ.. కొత్త నిజాలు బయటకు వస్తున్నట్లు సమాచారం. గత ఐదేళ్లుగా జానీ మాస్టర్ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడని.. మతం మార్చుకుని పెళ్ళి చేసుకోవాలని బెదిరించాడని ఆమె లిఖిత పూర్వకంగా రాసి కంప్లైంట్ చేసింది. అయితే తాజాగా ఈ విషయంపై సింగర్ చిన్మయి శ్రీపాద కూడా స్పందించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఒక ఫెమినిస్ట్ అన్న సంగతి అందరికి తెలిసిందే. సమాజంలో అమ్మాయిలకు సంబంధించి ఎప్పుడు , ఎలాంటి సమస్య తలెత్తినా కానీ.. ఆమె వెంటనే స్పందిస్తుంది. సోషల్ మీడియాలో తనదైన శైలిలో పోస్ట్స్ పెడుతూ ఎదో విధంగా వారికి అండగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా జానీ మాస్టర్ పై ఓ యువతి పెట్టిన కేసు విషయంలోనూ స్పందించింది. ఆమె సోషల్ మీడియాలో కొన్ని మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ.. ‘ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయిని మైనర్ గా ఉన్నప్పటినుంచి కూడా వేధించడం మొదలు పెట్టాడు. అత్యాచారం చేయడమే నేరం అయితే.. మైనర్ పై చేయడం మరో పెద్ద నేరం.. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి మరింత శక్తి చేకూరాలని నేను కోరుకుంటున్నాను’. అంటూ చిన్మయి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఆమెతో పాటు హీరోయిన్ పూనాల్ కౌర్ కూడా ఈ విషయంపై స్పందించింది . ‘ఆమె చేసింది ఆరోపణలు మాత్రమే. ఇంకా నేరం నిరూపణ కాలేదు. నిజంగా నేరం నిరూపణ అయితే మాస్టర్ అనే హోదాని అతను కచ్చితంగా అనర్హుడు అవుతాడు’ అంటూ కామెంట్ చేసింది. ఇలా పలువురు సెలెబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తున్నారు. ఇక జానీ మాస్టర్ కేసు విషయానికొస్తే.. తాజాగా ఆ యువతి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. అందులో ఆమె వయస్సు 21 సంవత్సరాలు మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. దానిని బట్టి చూస్తే జానీ మాస్టర్ ఆమెకు పరిచయం అయినప్పుడు ఆమె వయస్సు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి సింగర్ చిన్మయి చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని .. పోలీసులు ఆమెకు తగిన న్యాయం చేయాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కేసు విషయం పై మరిన్ని నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş