iDreamPost
android-app
ios-app

‘బుట్టబొమ్మ’ సింగర్.. ఓ ఇంటివాడు కాబోతున్నాడు! ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్!

  • Author ajaykrishna Updated - 01:59 PM, Tue - 29 August 23
  • Author ajaykrishna Updated - 01:59 PM, Tue - 29 August 23
‘బుట్టబొమ్మ’ సింగర్.. ఓ ఇంటివాడు కాబోతున్నాడు! ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్!

ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీల పెళ్లిళ్లకు టైమ్ వచ్చినట్లు ఉంది. ఇన్నాళ్లు బ్యాచిలర్స్ గా ఉన్నవారు అందరు మెల్లగా ఓ ఇంటివారు అవుతుండటంతో.. ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. ఈసారి యాక్టర్ కాదు.. తెలుగులో నలభైకి పైగా పాటలు పాడిన ఓ స్టార్ సింగర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆ సింగర్ ఎవరో కాదు.. అర్మాన్ మాలిక్. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ఆల్రెడీ కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో పరిచయం ఏర్పడింది. మహానుభావుడులో రెండు కళ్లు, అల వైకుంఠపురంలో బుట్టబొమ్మ సాంగ్స్ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు.. పెళ్లితో లైఫ్ లో కొత్త జర్నీ స్టార్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

అర్మాన్ మాలిక్.. సింగర్ గా చాలా సాఫ్ట్ లవ్ సాంగ్స్ కి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతను పెళ్లి చేసుకోబోతుంది ఎవరినో తెలుసా? ఓ యూట్యూబర్ ని. ఫ్యాషన్ అండ్ బ్యూటీ వ్లాగ్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అశ్న ష్రాఫ్ ని పెళ్ళాడనున్నాడు అర్మాన్. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. కొన్నేళ్ల నుండి ప్రేమలో ఉన్న ఈ జంట.. త్వరలో ఏడు అడుగులు వేయనుంది. కాగా.. ఆగష్టు 28న అర్మాన్, అశ్నల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. అర్మాన్ తాను ప్రేమించిన అశ్నకు రింగ్ తొడిగాడు.. దీంతో కోరుకున్న వాడే జీవిత భాగస్వామి కాబోతుంటే.. అశ్న ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది.

ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంగేజ్మెంట్ ఫోటోలను అర్మాన్, అశ్న తమ తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు. దీంతో ఫేవరేట్ సింగర్, పాపులర్ యూట్యూబర్ పెళ్లి చేసుకొని ఒక్కటి అవుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనే శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అర్మాన్ మాలిక్.. ఎక్కువగా హిందీ సాంగ్స్ పాడుతుంటాడు. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, పంజాబీ, మరాఠీ ఇలా తదితర భాషలలో సూపర్ హిట్ సాంగ్స్ పాడి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. మరి అర్మాన్ పాడిన పాటల్లో మీ ఫేవరేట్ సాంగ్ ఏదో కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Aashna Shroff (@aashnashroff)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş