Venkateswarlu
పుష్ప సినిమాలో నటనకి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. కనుక పుష్ప 2 కోసం రెట్టించిన ఉత్సాహంతో నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలో ఎన్టీఆర్ 'దేవర' సినిమాను చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాకి పుష్ప సినిమాకు కొందరు పోలుస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
పుష్ప సినిమాలో నటనకి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. కనుక పుష్ప 2 కోసం రెట్టించిన ఉత్సాహంతో నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలో ఎన్టీఆర్ 'దేవర' సినిమాను చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాకి పుష్ప సినిమాకు కొందరు పోలుస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
Venkateswarlu
అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక దేవర సినిమా కూడా మొదట సింగిల్ పార్ట్ అనుకుని ఇప్పుడు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో పుష్ప, దేవర చిత్రాల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
ఆ పోలికలు ఏంటంటే… అల్లు అర్జున్‌తో సుకుమార్ పుష్పను మొదట సింగిల్ పార్ట్‌గానే అనుకున్నాడు. కానీ, పుష్ప గురించి సింగిల్ పార్ట్‌లో చెప్పడం కష్టం కనుక రెండు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు సుకుమార్ ప్రకటించాడు. దేవర సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఎన్టీఆర్‌తో తాను రూపొందిస్తున్న దేవర కథను సింగిల్ పార్ట్‌లో చూపిస్తే న్యాయం చేయడం కష్టంగా ఉంది. అందుకే కథకు పూర్తి న్యాయం జరగాలి అంటే, కథను పూర్తిగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి అంటే కచ్చితంగా రెండు పార్ట్‌లుగా విడుదల చేయాల్సిందే అని భావిస్తున్నట్లుగా కొరటాల శివ ప్రకటించాడు.
ఇక, పుష్ప, దేవర సినిమాల్లో హీరోల పాత్రలు చాలా మాస్ లుక్‌లో ఉంటాయి. పుష్ప తరహాలోనే దేవరలో జూ.ఎన్టీఆర్ కూడా ఊర మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు అంటూ ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్‌ను బట్టి చూస్తే అర్థం అవుతోంది. పుష్ప ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది, ఇక దేవర చేపల వేట మాటున సాగే స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందట. ఇక, హీరోయిన్స్ విషయంలో కూడా పోలికలు ఉండబోతున్నాయి అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.
పుష్పలో శ్రీ వల్లిగా రష్మిక డీ గ్లామర్‌గా కనిపించింది. ఇక దేవరలో కూడా జాన్వీ కపూర్ లంగా ఓణీలో డీ గ్లామర్ గానే కనిపించే అవకాశాలు ఉన్నాయి. సినిమా మేకింగ్ కూడా మొదటి పార్ట్ స్పీడ్‌గా పూర్తవుతోంది. రెండో పార్ట్‌కి పుష్ప 2 తరహాలోనే దేవర 2 కి కూడా కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలా పుష్ప మరియు దేవరల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయని ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అందుకే పుష్ప తరహాలో దేవర హిట్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.
కాగా, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ మేకింగ్ కి ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అల్లు అర్జున్ ను పుష్ప గా చూసి ఉర్రూతలూగిన హిందీ ప్రేక్షకులు ఇతర భాషల ప్రేక్షకులు ఏకంగా సినిమాకు రూ.450 కోట్ల వసూళ్లని కట్టబెట్టారు. ప్రస్తుతం అంతకు మించి అన్నట్లుగా పుష్పకి సీక్వెల్‌గా పుష్ప 2 ను దర్శకుడు సుకుమార్ రూపొందించే పనిలో ఉన్నాడు. మరి, దేవర సినిమా పుష్పలా ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.