iDreamPost
android-app
ios-app

సిల్క్‌ స్మిత పాత్రను రీక్రియేట్‌ చేసిన తమిళ సినిమా!

  • Published Sep 05, 2023 | 7:50 AM Updated Updated Sep 05, 2023 | 7:50 AM
  • Published Sep 05, 2023 | 7:50 AMUpdated Sep 05, 2023 | 7:50 AM
సిల్క్‌ స్మిత పాత్రను రీక్రియేట్‌ చేసిన తమిళ సినిమా!

తెలుగు వాడే అయినా తమిళంలో స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నారు విశాల్‌. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీ గడుపుతున్నారు. ఆయన తీసిన సినిమాలు తెలుగులో కూడా డబ్‌ అవుతూ ఉన్నాయి. దీంతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం ‘మార్క్‌ ఆంటోనీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌15 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో ఎస్‌జేసూర్య, సునీల్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు తమిళ సర్కిల్‌లో మంచి బజ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ‘మార్క్‌ ఆంటోనీ’కి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సినిమాలో అలనాటి తార సిల్క్‌ స్మిత పాత్ర కూడా ఉందట. ఆమె పాత్రను మార్క్‌ ఆంటోనీలో రీక్రియేట్‌ చేశారన్న టాక్‌ సినిమాలో సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది. 1980-90ల మధ్య జరిగే కథ కావటం.. అది కూడా డాన్స్‌కు సంబంధించిన కథ కావటంతో సిల్క్‌ స్మిత పాత్రను సినిమాలో పెట్టారు. అయితే, సినిమా సర్కిల్‌లో చర్చ జరుగుతున్నట్లు సిల్క్‌ స్మిత పాత్రను రీక్రియేట్‌ చేయలేదు.

అచ్చం సిల్క్‌ స్మిత లాగా కనిపించే ఓ నటితో ఆ పాత్రను చేయించారు. జూనియర్‌ సిల్క్‌ స్మితగా చెప్పుకునే విష్ణు ప్రియ గాంధీ ఆ పాత్రను చేస్తున్నారు. ట్రైలర్‌ ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా ఉన్నాయి. విష్ణు ప్రియను చూస్తే.. అచ్చం అలనాటి సిల్క్‌ స్మితను చూసినట్లుగానే అనిపిస్తోంది. ఈ సినిమాలో ఓ ఐటమ్‌ సాంగ్‌ కూడా ఉండబోతోందట. ఈ సినిమాలో సిల్క్‌ స్మిత పాత్ర ఎలా ఉండబోతోందో తెలియాలంటే సెప్టెంబర్‌ 15 వరకు ఆగాల్సిందే. మరి, మార్క్‌ ఆంటోనీలో సిల్క్‌ స్మిత పాత్రను పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom