iDreamPost
android-app
ios-app

మంచి లక్ష్మి కోపం.. చిన్న తప్పుకి లైవ్‌లో చేయి చేసుకుంది!

  • Published Sep 21, 2023 | 1:19 PM Updated Updated Sep 21, 2023 | 1:19 PM
  • Published Sep 21, 2023 | 1:19 PMUpdated Sep 21, 2023 | 1:19 PM
మంచి లక్ష్మి కోపం.. చిన్న తప్పుకి లైవ్‌లో చేయి చేసుకుంది!

రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచు లక్ష్మికున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరస్‌లు చేస్తూ.. కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటారు మంచు లక్ష్మి. సోషల్‌ మీడియాలో ఆమె చేసే పోస్టులన్ని నిమిషాల వ్యవధిలో వైరలవుతుంటాయి. ఆమె మీద అదే స్థాయిలో ట్రోలింగ్‌ కూడా జరుగుతుంటుంది. కానీ మంచు లక్ష్మి మాత్రం ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోదు. ఎవరు ఏమనుకున్నా సరే.. తన దారిలోనే వెళ్తుంటారు. ఈక్రమంలో తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీనిలో లైవ్‌లో ఒక వ్యక్తి మీద చేయి చేసుకున్నారు మంచు లక్ష్మి.

కొన్ని రోజులు క్రితం దుబాయ్‌ వేదికగా సైమా అవార్డుల వేడుక జరిగింది. దక్షిణ భారతదేశానికి చెందిన తారలంతా ఈ ఫంక్షన్‌లో పాల్గొనడం కోసం దుబాయ్‌ బాట పట్టారు. మంచు లక్ష్మి కూడా సైమా అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వేదిక బయట మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి కెమరాకు అడ్డుగా వెళ్లాడు. దాంతో ఆమెకు కోపం తారా స్థాయికి చేరింది. వెంటనే ఆ వ్యక్తి వీపు మీద ఒక్కటి చరిచారు. ఆ తర్వాత కెమరా వైపు తిరిగి మాట్లాడాదామని భావించగా.. మరో వ్యక్తి అడ్డు వచ్చాడు.

దాంతో మంచు లక్ష్మికి కోపం నషాళానికి అంటింది. డ్యూడ్‌ కెరాకు అడ్డు రాకుండా ఉండాలనేది మినిమం బేసిక్‌.. అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పిచ్చి తగ్గలేదు ఏమో.. ఎవరైనా పూనారా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు జనాలు. ఇక గత రెండు రోజులుగా మంచు లక్ష్మి పొలిటికల్‌ ఎంట్రీ గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె బీజేపీలో చేరతారంటూ వార్తలు వెలువడుతున్నాయి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş