iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోయిన్ తో సిద్ధు పెళ్లి? చేసుకుంటే తప్పేంటంటున్న సోదరుడు..

  • Published Mar 11, 2024 | 8:40 PM Updated Updated Mar 11, 2024 | 8:40 PM

Siddu Jonnalagadda Marriage Clarity: ఈ మధ్య వరుగా వెండితెర, బుల్లితెర నటీనటులు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెడుగుపెడుతున్నారు. చాలా వరకు తమ సహనటులను ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

Siddu Jonnalagadda Marriage Clarity: ఈ మధ్య వరుగా వెండితెర, బుల్లితెర నటీనటులు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెడుగుపెడుతున్నారు. చాలా వరకు తమ సహనటులను ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

  • Published Mar 11, 2024 | 8:40 PMUpdated Mar 11, 2024 | 8:40 PM
స్టార్ హీరోయిన్ తో సిద్ధు పెళ్లి? చేసుకుంటే తప్పేంటంటున్న సోదరుడు..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుసగా నటీనటులు, దర్శకులు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. వీరిలో ఎక్కువగా తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొంతమంది తమ పెద్దలు నిశ్చయించిన వారినే పెళ్లి చేసుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి.. యంగ్ హీరో అబ్బవరం తన సహనటిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇదిలా ఉంటే డీజే టిల్లూ మూవీతో సెన్సేష్ క్రియేట్ చేసిన హీరో సిద్దూ జొన్నలగడ్డ సోదరుడు ఆయన పెళ్లిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కెరీర్ బిగినింగ్.. జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ మూవీతో హీరోగా మారాడు. కల్కి మూవీలో నెగిటీవ్ పాత్రలో నటించాడు. ఇక 2022లో రిలీజ్ అయిన డీజే టిల్లూ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను కబుపుబ్బా నవ్వించాడు. ‘డీజే టిల్లూ సాంగ్’ పాట ఇప్పటీ పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా సిద్దు జొన్నలగడ్డ కు సంబంధించిన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో సిద్దూ టాప్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ విషయంపై సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సిద్దూ ఓ స్టార్ హీరోయిన్ లవ్ లో ఉన్నాడని.. వచ్చే సంవత్సరం వీరిద్దరూ పెళ్లి చేసుకోబుతున్నారని వార్తలు వస్తున్నాయి. అవును స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. అదే స్టార్ హీరోని పెళ్లి చేసుకుంటేనే సమస్య అవుతుంది కదా.. సిద్దూకి పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉంది. మరి స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడో.. లేదో ఆ విషయం నాకు తెలియదు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో పెళ్లి జరగవొచ్చు’ అని అన్నారు. రిసెంట్ గా చైతన్య బబుల్ గమ్ మూవీతో మంచి పేరు సంపాదించాడు. సిద్దు జొన్నగడ్డ ‘డిజే టిల్లూ’ సీక్వెల్ లో నటిస్తున్నాడు. టిల్లు స్క్వేర్ తో మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş