iDreamPost
android-app
ios-app

Siddharth: ఏలియన్ తో సిద్దార్ధ్ సావాసం.. కారణం ఏంటంటే?

  • Published Dec 13, 2023 | 5:49 PM Updated Updated Dec 13, 2023 | 5:49 PM

లవర్ బాయ్ సిద్ధార్ధ్ ఓ ఏలియన్ తో సావాసం చేస్తున్నాడట. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లవర్ బాయ్ సిద్ధార్ధ్ ఓ ఏలియన్ తో సావాసం చేస్తున్నాడట. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Dec 13, 2023 | 5:49 PMUpdated Dec 13, 2023 | 5:49 PM
Siddharth: ఏలియన్ తో సిద్దార్ధ్ సావాసం.. కారణం ఏంటంటే?

సిద్ధార్ధ్.. లవర్ బాయ్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి, అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫిదా చేశాడు. అయితే గత కొద్ది కాలం నుంచి లవర్ బాయ్ క్యారెక్టర్లను తగ్గించి.. తన పంథా మార్చి సినిమాలు చేయడం మెుదలుపెట్టాడు. అందులో భాగంగానే ఇటీవలే ‘చిన్నా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ మూవీలో సిద్ధార్ధ్ నటన అభిమానులను ఆకట్టుకుంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. సిద్ధార్ధ్ ఓ ఏలియన్ తో సావాసం చేస్తున్నాడట. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో మరో హీరోకి సాయం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకుసాగుతూ ఉంటారు కొందరు హీరోలు. ఇది ఇలా ఉండగా.. ఓ సినిమాలో భాగంగా గ్రహాంతర వాసితో సావాసం చేశాడు సిద్ధార్ధ్. ఈ వార్త విని అందరు షాకైయ్యారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. సై ఫై బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో శివ కార్తికేయన్ తో పాటుగా ఓ ఏలియన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఏలియన్ కు తన గొంతును అందిస్తున్నాడు సిద్దార్ద్. అదేనండి గ్రహాంతరవాసికి డబ్బింగ్ చెప్పబోతున్నాడు.

కాగా.. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. డైరెక్టర్ ఆర్. రవికుమార్ ఈ అయలాన్ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ తమిళ్, తెలుగులో ఒకేసారి రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో టాలీవుడ్ బడా స్టార్ల చిత్రాలు రేసులో ఉన్న నేపథ్యంలో శివ కార్తికేయన్ రిస్క్ తీసుకుంటాడో లేదో వేచి చూడాలి. మరి ఏలియన్ క్యారెక్టర్ కు లవర్ బాయ్ గొంతు అప్పివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş