iDreamPost
android-app
ios-app

ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటే? పెద్దమ్మ శ్యామలా దేవీ ఆసక్తి కర వ్యాఖ్యలు

  • Published Jul 08, 2024 | 2:00 AM Updated Updated Jul 08, 2024 | 2:00 AM

Prabhas Weeding.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి 2898 ఏడీ మూవీ హిట్టుతో మంచి జోష్ మీదున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చిత్రయూనిట్ కూడా ఎంతో సంతోషంగా ఉంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Prabhas Weeding.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి 2898 ఏడీ మూవీ హిట్టుతో మంచి జోష్ మీదున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చిత్రయూనిట్ కూడా ఎంతో సంతోషంగా ఉంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Published Jul 08, 2024 | 2:00 AMUpdated Jul 08, 2024 | 2:00 AM
ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటే? పెద్దమ్మ శ్యామలా దేవీ ఆసక్తి కర వ్యాఖ్యలు

బాహుబలి, బాహుబలి 2తో పాన్ ఇండియా కాదు గ్లోబల్ స్టార్‌గా మారాడు డార్లింగ్ ప్రభాస్. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు సగటు ప్రేక్షకుడ్ని నిరాశపర్చిన.. కలెక్షన్లకు, నిర్మాతలకు ఏ ఢోకా రాలేదు. సాహో తెలుగులో సోసో అనిపించినా.. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆది పురుష్ ప్రభాస్ అభిమానుల్ని సైతం నిరుత్సాహానికి గురి చేశాయి. ఆ సమయంలో వచ్చింది సలార్. ఆరేళ్ల పాటు డార్లింగ్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అదే చూపించాడు ప్రశాంత్ నీల్. ఇంకేముందు కాటేరమ్మ కొడుకు బాక్సాఫీసును మరోసారి తన నటనతో షేక్ చేసేశాడు. ఇప్పుడు కల్కి 2898ఏడీతో పలకరించాడు.

ఆచార్య పుత్రా ఆలస్యమైందా అని పలకరించిన యంగ్ రెబల్ స్టార్ మాసీ హిట్ అందుకున్నాడు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లు దద్దరిల్లేలా చేసింది. నాగ్ అశ్విన్ ప్రతిభను కొనియాడకుండా ఉండలేకపోతున్నారు ప్రముఖ దర్శకులు సైతం. ఇక ప్రభాస్ నటనకు ఫిదా కాని వారు లేరు. కటౌట్ కు తగ్గ ఎలివేషన్ కంటెంట్ కనబడగానే బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే ఈ సినిమా రూ. 800 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. వెయ్యి కోట్లకు దిశగా అడుగులు వేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పట్ల చిత్ర యూనిట్టే కాదు.. పెద్దమ్మ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు ఈ సినిమా చూసిన ప్రభాస్ పెద్దమ్మ, దివంగత నటుడు కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవీ.. ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద బుజ్జి కారులో కూర్చుని సందడి చేశారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలోనే ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచు లర్ పెళ్లిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో ప్రభాస్‌కు పెళ్లికాదని ఓ జ్యోతిష్కుడు చెప్పిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. ‘ గతంలో ప్రభాస్ సినిమాలు సక్సెస్ కావు అన్నారు. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రభాస్ సినిమాలు ఆడవన్న వారి అంచనాలు కల్కితో తలకిందులయ్యాయి. ప్రభాస్‌ పెళ్లి కూడా అంతే.  తన అభిమానుల కోసం ప్రభాస్‌ ఎంతగానో కష్టపడుతున్నాడు. పెళ్లి చేయాలని మాకు కూడా ఉంటుంది. కానీ సమయం రావాలి. ఇప్పటివరకు అన్ని అనుకున్నట్లే జరిగాయి. అలాగే ప్రభాస్‌ పెళ్లి కూడా జరుగుతుంది’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పెద్ద లైనప్పే ఉంది. సలార్ 2, కల్కి 2, స్పిరిట్, సీతారామం దర్శకుడు హను రాఘవపూడితో మరోటి ఉంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabet