బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

ప్రముఖ నటుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఇంతకు ఆ నటుడు ఎవరంటే..? ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

ప్రముఖ నటుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఇంతకు ఆ నటుడు ఎవరంటే..? ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

శారీరకంగా అలసట చెందినా, తీవ్రంగా ఆలోచన చేసినా.. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వచ్చేస్తోంది గుండె నొప్పి. కరోనా అనంతరం హార్ట్ ఎటాక్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే కఠిన వ్యాయామాలు చేయవద్దని, శారీరంగా, మానసికంగా ఎక్కువ ఒత్తిడి తెచ్చుకోవద్దని సూచించింది. ఈ రెండేళ్ల కాలంలోనే చాలా మంది హార్ట్ స్ట్రోక్ బాధితులయ్యారు. గుండెపోటుకు సినీ సెలబ్రిటీలు కూడా అతీతం కాదు. పునీత్ రాజ్ కుమార్ మొదలుకుని మొన్న కేరళ వర్ధమాన నటి లక్ష్మికా సజీవన్ వరకు హార్ట్ ఎటాక్ బాధితులే. తాజాగా ప్రముఖ నటుడు గుండె పోటుకు గురయ్యాడు.

బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే (47) గురువారం సాయంత్రం హార్ట్ ఎటాక్ రావడంతో హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. పుష్ప హిందీ వర్షన్‌లో అల్లు అర్జున్‌కు డబ్బింగ్ చెప్పింది ఇతగాడే. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి హీరోలుగా తెరకెక్కుతున్న వెల్కమ్ టు ది జంగిల్ షూటింగ్ సమయంలో తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆయన్ను ముంబయి అంధేరీ వెస్ట్ లోని బెల్లె వ్యూ ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు అతడికి శస్త్ర చికిత్స అందించారు. యాంజియో ప్లాస్టీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.. మూడు, నాలుగు రోజుల్లో డి శ్చార్జి అవుతారని పేర్కొన్నారు. శ్రేయాస్ మరాఠీ సీరియల్స్‌ ద్వారా తన కెరీర్ ప్రారంభించాడు.

అంఖేన్ సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు శ్రేయాస్. ఇక్బాల్, ఓం శాంతి ఓం, గోల్ మాల్3, ఎగైన్, హౌస్ ఫుల్ చిత్రాల్లో నటించాడు. చివరి సారిగా.. ఓటీటీ సినిమా కౌన్ ప్రవీణ్ తాంబే చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం కంగనా రనౌత్ ఎమర్జెన్సీ చిత్రంతో పాటు వెలకమ్ టు ద జింగిల్ పిక్చర్స్‌లో యాక్ట్ చేస్తున్నాడు. ఎమర్జెన్సీ మూవీలో మాజీ ప్రధాని వాజ్ పేయిగా కనిపించబోతున్నాడు. పుష్ప 1 మూవీలో అల్లు అర్జున్‌కు గొంతు అరువిచ్చిన ఈ నటుడు.. పుష్ప 2కు కూడా బన్నీకి డబ్బింగ్ చెప్పనున్నాడు. ఇలా చిన్న వయస్సులోనే గుండె పోటుకు గురవ్వడం వెనుక కారణాలు మీరేమని భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments