iDreamPost
android-app
ios-app

బోల్డ్ బెడ్ రూమ్ సీన్స్ తో ప్రభాస్ హీరోయిన్ కొత్త సినిమా!

  • Published Jul 13, 2023 | 8:55 AM Updated Updated Jul 13, 2023 | 8:55 AM
  • Published Jul 13, 2023 | 8:55 AMUpdated Jul 13, 2023 | 8:55 AM
బోల్డ్ బెడ్ రూమ్ సీన్స్ తో ప్రభాస్ హీరోయిన్ కొత్త సినిమా!

ఒక సినిమా హిట్ అయితే దానికి వెంటనే సీక్వెల్స్ తెరపైకి వస్తున్న టైమ్ ఇది. సినిమా జానర్ ఎలాంటిదైనా.. హీరో హీరోయిన్స్ ఎవరైనా సీక్వెల్స్ మాత్రం ప్రకటించేస్తున్నారు. ఇప్పటిదాకా అలా హిట్ సినిమాలకు సీక్వెల్స్ చాలా చూశాం. ఇప్పుడు ఇదే వరుసలో చేరింది బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘స్త్రీ’. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా.. 2018లో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి.. బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. హారర్ కామెడీ జానర్ లో మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ‘స్త్రీ 2’ ని తెరపైకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

స్త్రీ మూవీ.. నటిగా శ్రద్దా కపూర్ ని మరో మెట్టు పైకి ఎక్కించింది. తాజాగా స్త్రీ మూవీ సీక్వెల్ షూటింగ్ మొదలైంది. ఎప్పటిలాగే శ్రద్దా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆమెకు జంటగా రాజ్ కుమార్ రావు నటిస్తున్నాడు. అయితే.. ఈ సీక్వెల్ మూవీ షూటింగ్ ని మొదటి రోజే బోల్డ్ బెడ్ రూమ్ సన్నివేశాలతో స్టార్ట్ చేశారట మేకర్స్. శ్రద్ధా కపూర్ ఈ మధ్య బోల్డ్ సన్నివేశాలకు కూడా ఓకే చెప్పేస్తోంది. రీసెంట్ గా ‘తూ ఝాటి మై మక్కర్’ మూవీలో రణబీర్ కపూర్ సరసన రెచ్చిపోయి నటించింది. ఏకంగా ఎన్నడూ లేనివిధంగా టు పీస్ బికినీలో.. కిస్సింగ్ సీన్స్ లో అల్లాడించింది. దాంతో శ్రద్ధా బోల్డ్ పాత్రలకు సిద్ధంగా ఉందని మేకర్స్ కి అర్ధమైంది.

దీంతో ఇప్పుడు స్త్రీ సీక్వెల్ స్క్రిప్ట్ ని బోల్డ్ గానే సిద్ధం చేసాడట డైరెక్టర్ అమర్ కౌశిక్. ఇక సీక్వెల్ లో మొదటి రోజే హీటెక్కించే బోల్డ్ బెడ్ రూమ్ సీన్స్ ని.. శ్రద్ధా, రాజ్ కుమార్ రావుల మధ్య షూట్ చేసినట్లు సమాచారం. విరహతాపంతో రగిలిపోతున్న దెయ్యం పాత్రలో శ్రద్ధా రియలిస్టిక్ గా కనిపించనుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో శ్రద్దా కపూర్ బోల్డ్ అటెంప్ట్ యూత్ ని బాగా కైపెక్కించే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సీక్వెల్ కథను కూడా ఓ కామపిశాచి క్యారెక్టర్ చుట్టూ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. స్త్రీ 2 మూవీని పాన్ ఇండియా లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు టాక్. ఇక శ్రద్ధా కపూర్.. డార్లింగ్ ప్రభాస్ తో సాహో సినిమా చేసి తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. మరి శ్రద్ధా కపూర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom