iDreamPost

రైటర్ తో డేటింగ్.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్!

గత కొంతకాలంగా రైటర్ తో ఓ స్టార్ హీరోయిన్ డేటింగ్ చేస్తోందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ విషయంపై మాత్రం ఆ బ్యూటీ నోరు విప్పలేదు. అయితే తాజాగా ఒక్క పోస్ట్ తో రైటర్ తో డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది ఆ ముద్దుగుమ్మ.

గత కొంతకాలంగా రైటర్ తో ఓ స్టార్ హీరోయిన్ డేటింగ్ చేస్తోందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ విషయంపై మాత్రం ఆ బ్యూటీ నోరు విప్పలేదు. అయితే తాజాగా ఒక్క పోస్ట్ తో రైటర్ తో డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది ఆ ముద్దుగుమ్మ.

రైటర్ తో డేటింగ్.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ లకు కొదవలేదు. పలానా హీరో..పలానా హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని, వారిద్దరు గత కొంత కాలాంగా చెట్టాపట్టాలేసుకుని తీరుగుతున్నారన్న వార్తలు మనం చాలానే విన్నాం. అయితే ఈ విషయాన్ని సదరు నటీ, నటులు మాత్రం బాహాటంగా బయటకు చెప్పరు. ఇక మరికొందరు మాత్రం, అవును మేం ప్రేమించుకుంటున్నాం అని కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతారు. గత కొంతకాలంగా రైటర్ తో ఓ స్టార్ హీరోయిన్ డేటింగ్ చేస్తోందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ విషయంపై మాత్రం ఆ బ్యూటీ నోరు విప్పలేదు. అయితే తాజాగా ఒక్క పోస్ట్ తో రైటర్ తో డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది. మరి ఆ రైటర్ ఎవరు? ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముంది? తెలుసుకుందాం పదండి.

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ చాలా రోజులుగా  బాలీవుడ్ స్టార్ రైటర్ రాహుల్ మోదీతో రిలేషన్ లో ఉందని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కానీ ఈ న్యూస్ పై శ్రద్ధా ఇప్పటి వరకు నోరువిప్పలేదు. తాజాగా ఒకే ఒక్క పోస్ట్ తో ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇచ్చింది. ఇక ఆ పోస్ట్ ను చూసిన అభిమానులు ఇద్దరి మధ్య ప్రేమ ఉందని ఫిక్సైపోయారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే శ్రద్ధా కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పెట్టింది. అందులో రాహుల్ చేయి పట్టుకుని దిగిన ఫొటో ఉంది. పైగా ఈ పిక్ కు ఓ రొమాంటిక్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. “నా హృదయాన్ని నీ దగ్గరే ఉంచుకో.. కానీ, నా నిద్రను మాత్రం తిరిగి ఇచ్చేయ్” అంటూ స్మైల్ ఎమోజీలతో పాటుగా రెడ్ హార్ట్ సింబల్ ను పెట్టింది.

ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అభిమానులు శ్రద్ధా ఒక్క పోస్ట్ తో తన లవ్ కన్ఫామ్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఏకంగా శుభాకాంక్షలే తెలుపుతున్నారు. కాగా వీరిద్దరికి  ‘తు ఝూతి మైన్ మక్కార్’ అనే సినిమా నుంచి పరిచయం అయ్యింది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త.. ప్రేమకు దారితీసింది. ఈ మూవీకి రాహుల్ రైటర్ గా పనిచేయగా.. రణ్ బీర్ కపూర్ హీరోగా నటించాడు. ఇక అప్పటి నుంచి వీరిద్దరు బాలీవుడ్ లో జరిగిన కొన్ని ఫంక్షన్లకు కలిసి హాజరైయ్యారు. ఇటీవలే జరిగిన అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో కూడా జంటగా మెరిశారు. ఇప్పుడు తన ఇన్ స్టాలో స్టోరీ పెట్టి.. తమ డేటింగ్ ను ఈ బ్యూటీ కన్ఫామ్ చేసిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి